Tuesday, 3 November 2026

September 2013

మెదక్

ఏసీబీకి చిక్కిన గురుకుల ప్రిన్సిపాల్‌

మెదక్‌ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నారు.

జాతీయం

ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నాన్నానికి వాయిదా వేసిన హైకోర్టు

న్యూఢిల్లీ : ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నాన్నానికి వాయిదా పడింది. శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టుకు ఏపీఎన్జీవోలు ,సీమాంధ్ర సచివాలయ పోరం ,పిటిషనర్‌ ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ సర్వీస్‌, మున్సిపల్‌ శాఖ ఉద్యోగులతో పాటు మరికొంతమంది రాతపూర్వకంగా వాదనలు…

హైదరాబాద్

విజయసాయి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌ :జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్‌ 4వ తేదికి వాయిదావేసింది.

ముఖ్యాంశాలు

చిన్నారి శ్రీయ హత్యకేసులో నేరం రుజువు

మహబూబ్‌నగర్‌ : చిన్నారి శ్రీయ హత్యకేసులో నిందితుల నేరం రుజువైంది.ఈ కేసులో ముగ్గురు నిందితులను మధ్యాహ్నం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

హైదరాబాద్

జగన్‌ పిటిషన్‌పై విచారణ 30కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌ : ఇడుపులపాయ ,గుంటూరు, పర్యటనలకు అనుమతివ్వాలన్నా జగన్‌ పిటిషన్‌ను ఈరోజు కోర్టు విచారించింది.సీబీఐ నాంపల్లి కోర్టు కేసును ఈ నెల 30కి వాయిదా వేసింది.

జాతీయం

ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కుంది. సుప్రీంకోర్టు

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఈ రోజు ఓటర్లకు సంభందించి సంచలన తీర్పునిచ్చింది. ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. ఈవీఎంలలో నెగెటివ్‌కు బటన్‌ కేటాయించాలని ఈసీకి ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని తన…

హైదరాబాద్

కిషన్‌రెడ్డితో సమావేశమైన టీజేఏసీ నేతలు

హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ,ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌ సమావేశమయ్యారు.సకలజన భేరీ సభ ఏర్పాట్లను కిషన్‌రెడ్డితో చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

కీచక ఉపాధ్యాయుని అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐ కాలేజీలో విద్యార్ధినిని వైస్‌ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నాడని కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీకి చేరుకున్న పోలీసులు వైస్‌ ప్రిన్సిపాల్‌ మురళిని అరెస్ట్‌ చేయడంతో విద్యార్థులు శాంతించారు.

హైదరాబాద్

భక్తల్‌ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు : తబ్రేజ్‌

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లకేసు విచారణలో ఎన్‌ఐఏ పురోగతి సాధించింది. ఎన్‌ఐఏ విచారణలో అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ తబ్రేజ్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రయివేట్‌ ట్రావెల్స్‌లో మంగళూర్‌నుంచి వచ్చి రెక్కి నిర్వహించే వారని తెలిపాడు.అబిడ్స్‌,మలక్‌పేట్‌,దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కి…

సీమాంధ్ర

బ్యాంక్‌ కార్యకలాపాలను అడ్డుకున్న ఏపీఎన్జీవోలు

విశాఖపట్నం : సమైక్యాంధ్రకు మద్దతుగా కూర్మనపాలెంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్షం ఆందోళన చేపట్టింది. విశాఖలో బ్యాంకులు,తపాలాశాఖ కార్యకలాపాలను ఏపీఎన్జీవోలు ,ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.