Wednesday, 4 November 2026

September 2013

తెలంగాణ

మైక్య వాదానికి బలం లేదు.:కోదండరాం

హైదరాబాద్‌ : సమైక్యవాదానికి బలం లేదని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు.టీఎన్జీవో భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సభలకు అనుమతిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారని ,తమ పోరాటం ముఖ్యమంత్రి కి…

వార్తలు

ఓయూ జేఏసీ నేతపై ఏపీ ఎన్జీవోలదాడి

హైదరాబాద్‌: విద్వేషాలు రెచ్చగొట్టము అని చెబుతున్న ఏపీ ఎన్జీవోలు పాశవిక చర్యలకు పాల్పడుతున్నారు. బషీర్‌బాగ్‌ వద్ద నడి రోడ్డు పై ఓయూ ఏఏసీ నేత దూదిమెట్ల బాలరాజు పై ఏపీ ఎన్జీవోలు పిడిగుద్దుల వర్షం కురిపించారు. తన మెదడు…

హైదరాబాద్

బుల్లెట్‌ నడిపిన ఈటెల, హరీష్‌రావు

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌,హరీష్‌రావులు అసెంబ్లీకి బుల్లెట్‌ బైక్‌పై స్వయంగా నడుపుకుంటూ వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు.

హైదరాబాద్

రాజకీయ నేతల కనుసన్నల్లోనే ఏపి ఎన్జీవోల సభ : హరీష్‌రావు

హైదరాబాద్‌ : ఏపిఎన్జీవోల సభ సీమాంధ్ర రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.ఉద్యోగుల సభకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు నిధులెక్కడివని ఆయన ప్రశ్నించారు. సభకు బస్సులు ప్రాంగణానికి ఏర్పాట్లు ఎవరు చేశారో అందరికి…

హైదరాబాద్

సీమాంధ్రలో సభ పెట్టాలనే యోచనలో ఉన్నాం : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌ : విశాఖ లేదా విజయవాడలో బహిరంగ సభ పెట్టాలనే యోచనలో ఉన్నామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ తెలిపారు. తాజా పరిస్థితులపై చర్చించేందుకు టీజేఏసి నేతలు భేటి అయ్యారు.

హైదరాబాద్

ఓయూలో బాష్పవాయు ప్రయోగం

హైదరాబాద్‌ : ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎల్బీస్టేడియం వైపు రావడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్ధులు వారిపై రాళ్లు రువ్వారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన విద్యార్థులను చెదరగొట్ట డానికి బాష్పవాయుప్రయోగం చేశారు.ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం.

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం కాలరాస్తొంది: ఈటెల

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా అవమానించే చర్యలను ఖండిస్తున్నామని తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. తెరాస శాసనసభ్యుల హక్కులను కాలరాసిన చీకటి సంధర్బం అని ఆయన పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన తెరాస…

హైదరాబాద్

ఏపీ ఎన్జీవో హోమ్‌ ముట్టడీకి యత్నం

హైదరాబాద్‌ : ఏపీ ఎన్జీవో హోమ్‌ ముట్టడికి ఓయూ ఐకాస ప్రయత్నించగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఏపీ ఎన్జీవో హోమ్‌ వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్

ఓయూ వద్ద పోలీసులపై రాళ్లు రువ్వుతున్న విద్యార్థులు

హైదరాబాద్‌ : ఎల్బీ స్టేడియం వైపు రాకుండా ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులపై ఓయూ విద్యార్థులు రాళ్లురువ్వుతున్నారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.