Wednesday, 4 November 2026

December 2013

అంతర్జాతీయం

పూజారా 150 నాటౌట్‌

జోహెన్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాడు ఛటేశ్వర పూజారా 150 పరుగులు పూర్తి చేశాడు. 247 బంతులు ఎదుర్కొన్న పూజారా 21 ఫోర్లతో 150 పరుగులను పూర్తి చేసి ద్విశతకం వైపు దూసుకుపోతున్నాడు.

హైదరాబాద్

అన్ని పార్టీలు సమైక్యంగా ముందుకెళ్లాలి: అశోక్‌ బాబు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినందుకు అన్ని పార్టీలు ఒకే మాటపై వెళ్లాలని నిర్ణయించినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఏపీఎన్జీవో హోం ఏర్పాటు చేసిన అఖిలపక్ష…

హైదరాబాద్

అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపుతాం:సబ్బం హరి

హైదరాబాద్‌: అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపుతామని ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఏపీఎన్జీవో హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సబ్బం హరి మాట్లాడుతూ… ప్రజాప్రతినిధుల అఫిడవిట్లు చూసిన తర్వాత రాష్ట్రపతి పునరాలోచిస్తామని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో…

హైదరాబాద్

బ్యాంకు అధికారులతో సమావేశమైన కేంద్రమంత్రి మునియప్ప

హైదరాబాద్‌: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై బ్యాంకు అధికారులతో కేంద్ర మంత్రి మునియప్ప హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… ఔత్సాహికులకు వేగవంతంగా రుణాలు పంపిణీ చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. 2013-4లో రాష్ట్రంలో…

హైదరాబాద్

హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలి: సోమిరెడ్డి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ అంశం పై ముందుకు రావాలని కోరారు. విభజన బిల్లు తప్పుల తడకగా…

హైదరాబాద్

రాయలసీమకు జరిగిన అన్యాయం పై ఉద్యమిస్తాం: కె.ఇ. కృష్ణమూర్తి

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లు రాయలసీమకు జరిగిన అన్యాయంపై ఉద్యమం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కె.ఇ.కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను సభలో వినిపించే స్వేచ్ఛ చంద్రబాబు తమకు కల్పించినట్లు…

హైదరాబాద్

ఏపీఎన్జీవో హోమ్‌కు భారీ భద్రత

హైదరాబాద్‌: ఏపీఎన్జీవో హోమ్‌కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అబిడ్స్‌ నుంచి ఏపీఎన్జీవో హోమ్‌కు వెళ్లి అన్ని దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ వాదులు దాడి చేయవచ్చన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్

దేవయానిపై అమెరికా చర్యకు నిరసనగా విద్యార్థుల ప్రదర్శన

విజయవాడ(సబ్‌ కలెక్టరేట్‌): అమెరికాలో దేవయాని ఖోబ్రగాడే అరెస్టును నిరసిస్తూ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం బిషన్‌ అజరయ్య కళాశా విద్యార్థులు వివిధ పార్టీల నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌…

హైదరాబాద్

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని విద్యార్థులు కలిశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని, అవినీతి రహిత పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా 7 చెక్‌పోస్ట్‌ ల పై దాడులు : ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 7 చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీజీ ఎ.ఖాన్‌ తెలిపారు. ఏసీబీ సోదాల్లో రూ. 7 లక్షలు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి చెక్‌పోస్ట్‌లోనూ అక్రమాలు బయట పడ్గాయని, చెక్‌పోస్ట్‌ల వద్ద కొన్ని…