Tuesday, 3 November 2026

January 2014

హైదరాబాద్

గుర్తు తెలియని మృతదేహం అభ్యం

హైదరాబాద్‌ : నగరంలోని అఫ్జల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాదర్‌ఘాట్‌ సాయిబాబా దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెంది ఉన్నాడని తమకు సమాచారం అందిందని…

హైదరాబాద్

ప్రభుత్వరంగంలోనే కాదు ప్రైవేటు రంగంలోనూ అన్యాయమే:హరీష్‌రావు

హైదరాబాద్‌: సమైక్య పాలనలో ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగుల్లో కూడా తెలంగాణ ప్రాంతంవారికి అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు విమర్శించారు. ఇవాళ ఆయన తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించినఅనంతరం మాట్లాడారు.రాబోయే తెలంగాణలో ప్రైవేట్‌…

Main

సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని సింథీ కాలనీలో సంజయ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు.

జాతీయం

చెన్నైఎయిర్‌ పోర్టులో 27కిలోల బంగారం పట్టివేత

చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు 27 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రైవేట్‌ కార్గో విమానంలో చెనైె చేరుకున్న ప్యాక్‌ చేసిన పెట్టేలపై అనుమానం వచ్చిన అధికారులు వాటిని క్షుణంగా పరిశీలించగా పెట్టెల్లోని సెల్‌ఫోన్లలో భద్రపరచిన పసిడి బయటపడింది.…

హైదరాబాద్

ఎన్ని కుతంత్రాలు చేసిన ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు ఖాయం: మధుయాష్కి

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణను ఆపలేడని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు. సీఎంకు రాజ్యంగంపై అవగాహన లేక రాష్ట్రపతిని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాద్

30 తర్వాత ఎవరు ఆపిన తెలంగాణ బిల్లు ఆగదు

హైదరాబాద్‌: ఈ నెల 30 తర్వాత తెలంగాణ ఏర్పాటు ఎవరు ఆపిన ఆగదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా బిల్లుపై చర్చకు గడువు కోరడం సరికాదని వ్యాఖ్యానించారు.

జాతీయం

రాజ్‌ఠాక్రేపై కేసు నమోదు

ముంబై: శివసేన అధినేత రాజ్‌ఠాక్రేపై పుణే పోలీసులు కేసునమోదు చేశారు. టోల్‌ప్లాజా ధ్వంసంపై ఆయన పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్

వరంగల్‌లో ర్యాగింగ్‌ కలకలం

వరంగల్‌: వరంగల్‌లోని ఎన్‌ఐఐటీలో ర్యాగింగ్‌ సంఘటన కలకలం సృష్టించింది. సినియర్‌ విద్యార్థులు తనతో అసభ్యకరంగా ర్యాగింగ్‌కు పాల్పాడ్డారని జూనియర్‌ విద్యార్ధి అధికారులకు ఫిర్యాదే చేశారు. దాంతో అధికారులు 9 మంది సీనియర్‌ విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేశారు.…

హైదరాబాద్

ముగిసిన బీఏసీ సమావేశం

హైదరాబాద్‌: వాడివేడి చర్చలతో బీఏసీ సమావేశం ముగిసింది. తీర్మానాలపై ఇరు ప్రాంతాల నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు చర్చ కొనసాగింది.

హైదరాబాద్

ఆదాలకు దళిత ఎమ్మెల్యేల మద్ధతు ఉపసంహరణ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌కు ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్యేలు జీవీ శేషు, విజయ్‌ కుమార్‌ ఆదాలకు తాము మద్దతు ఇవ్వడంలేదని ప్రకటించారు.