Wednesday, 4 November 2026

February 2014

Cartoons

Chandrabadu naidu

మీ విధానమేంటో చెప్పమంటే నాకు పిల్లలెంతమంది అని అడుగుతావేంది?

వార్తలు

సుష్మాస్వరాజ్‌తో టీ జేఏసీ నేతల సమావేశం

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌నేత సుష్మాస్వరాజ్‌తో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్ధతు ఇచ్చి గెలిపించాలని కోరనున్నట్టు సమాచారం.

వార్తలు

తెలంగాణ బిల్లుపై భాజపాతో కేంద్రం సంప్రదింపులు : హరిబాబు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై భాజపాతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని భాజపా నేత హరిబాబు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం తన ప్రతిపాదనలు తెలిపితే పార్టీలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.…

వార్తలు

బీహర్‌లో ట్రక్‌ను ఢీకోన్న రైలు

పాట్నా : బీహర్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బగాహా-నార్క టాయాగంజ్‌ స్టేషన్ల మధ్య కాపలాదారుడు లేని ఒక లెవెల్‌క్రాసంగ్‌ వద్ద సప్త్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ గురువారం ఉదయం ఒక లారీని ఢికొంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలవలేదు.…

వార్తలు

టెట్‌ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ వాయిదా పడింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ఈ నెలాఖరులోపు పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

వార్తలు

చంద్రబాబు పిచ్చోడిలా తిరుగుతున్నాడు: పొన్నాల

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని చంద్రబాబు రెండు లేఖలు ఇచ్చాడని తీరా ఇపుడు తెలంగాణను ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న…

వార్తలు

10,11 తేదీల్లో జాతీయ బ్యాంకుల సిబ్బంది సమ్మె

హైదరాబాద్‌: జాతీయ బ్యాంకుల సిబ్బంది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు దాగనున్నారు. వేతనాల సవరణపై నిర్వాహకులకు, యూనియన్ల మధ్య చర్చలు విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌కి భారత్‌ బ్యాంకు సంఘాలకు మధ్య…

వార్తలు

వెంకయ్యనాయుడుతో జైరాం రమేష్‌ సమావేశం

న్యూఢిల్లీ: భాజపాసీనియర్‌ నేత వెంకయ్యనాయుడుతో కేంద్రమంత్రి జీవోఎం సభ్యుడు జైరాంరమేష్‌ సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుకు సంబంధించి భాజపా సూచించిన సవరణలు, మార్పులు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

వార్తలు

రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌: పయ్యావుల

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్టు తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఈ పిటిషన్‌ రేపు విచారణకు రానుందన్నారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగాద ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఆందోళనకు ఆయన తన…

వార్తలు

రేపు కేంద్ర కేబినేట్‌ ప్రత్యేక సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర కేబినేట్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. తెలంగాణ అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.