Monday, 2 November 2026

March 2014

వార్తలు

రూ. 2.35 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.2.35 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వరంగల్‌ జిల్లా వెంకటాపుర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో…

వార్తలు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్‌ కలెక్టర్‌

విశాఖపట్నం : గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పోరేషన్‌ బిల్‌ కలెక్టర్‌ రాంబాబు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇంటిపన్ను పత్రాల పేరు మార్పునకు ఓ మహిళ నుంచి రాంబాబు రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ప్రత్యక్షంగా చిక్కాడు.

వార్తలు

కాకరాపల్లి ఉద్యమానికి మూడేళ్లు

శ్రీకాకుళం : థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఉద్యమకారులపై కాల్పులు జరిపిన ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో పచ్చని పొలాల మధ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అమనుతినిచ్చింది. దీన్ని…

వార్తలు

టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ : టీ జేఏసీ విస్త్రృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌, టీజీవో నేత విఠల్‌ సహా అన్ని అనుబంధ జేఏసీ నేతలు సమావేశానికి హాజరయ్యారు.…

వార్తలు

తొర్లికొండలో చిరుత సంచారం

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండలో చిరుతపులి సంచరిస్తోంది. చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు.

వార్తలు

నల్గొండలో టీజేఏసీ విజయోత్సవ సభ

నల్గొండ : టీజేఏసీ ఆధ్వర్యంలో నేడు నల్గొండలో తెలంగాణ విజయోత్సవ సభ జరగనుంది. సభకు టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం, టీజీవో అధ్యక్షుడు దేవిశ్రీప్రసాద్‌ హాజరుకానున్నారు.

Featured News

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

పారిశ్రామిక సదస్సులో గీతారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని మాజీ మంత్రి జె. గీతారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిపై…

Featured News

ఎన్నికల వేళ

కరువు భత్యం పది శాతం పెంపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : ఎన్నికలు వేళ యూపీఏ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునేందుకు గాలం విసురుతోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డీఏ పెంచింది. శుక్రవారం…

Featured News

రాష్ట్రపతి వద్ద బిల్లు

తెలంగాణకు ఏడు, సీమాంధ్రకు మూడు కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణ ఏర్పడ్డాకే సీమాంధ్రులకు కొత్త రాజధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. పార్లమెంట్‌ ఉభయ సభల…

Featured News

పోలవరం పేర ముంచడాన్ని ఒప్పుకోం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : పోలవరం పేర తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన గూడాల్ని ముంచడాన్ని తాము ఒప్పుకోబోమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో…