Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

నేడు ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు www. apopenschool.org వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేయనున్నట్టు డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు.

హైదరాబాద్

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ: బత్తిని హరినాథ్‌గౌడ్

హైదరాబాద్: ప్రతియేటా బత్తిని సోదరులు అందించే చేపప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. జూన్‌ ఎనిమిదిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్‌గౌడ్ చెప్పారు. ఉబ్బసం, అస్తమా, దగ్గు, దమ్ము వ్యాధుల నుంచి ఉపశమనం కోసం…

వార్తలు

ఐసీసీలో ఫిక్సర్లున్నారు: లలిత్ మోడీ

లండన్: బీసీసీఐపై నిప్పులు చెరిగే ఐపీఎల్ బహిషృత కమిషనర్ లలిత్ మోడీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఫిక్సర్లు నడిపిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ (అంతర్జాతీయ అవినీతిపరుల మండలి)గా…

హైదరాబాద్

ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ‘కీ’ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ 31 వరకు గడువు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను పోస్ట్‌ద్వారా గానీ లేదా…

సీమాంధ్ర

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, కాలినడక వెళ్లే భక్తులకు 7 గంటల సమయం పడుతోంది.

ఖమ్మం

లారీ-కారు ఢీ: ముగ్గురు మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

వార్తలు

ఐపీఎల్-7లో నేటి మ్యాచ్‌లు

బెంగళూరు: ఐపీఎల్-7 క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడనుంది. రాత్రి 8 గంటలకు జరగనున్న మరో మ్యాచ్‌లో కోల్‌కతా…

నిజామాబాద్

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబాద్: రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి శివారులోని హర్షగురుకులం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను రైల్వే పోలీసులు ఈ ఉదయం గుర్తించారు. మృతులు కోటగిరి మండలం చేతన్ నగర్ కు చెందిన వాగ్మారే,…

వార్తలు

ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు

విజయనగరం: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరూ సంకుపాలెం గ్రామానికి చెందినవారు. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గచ్చలవలసలో చోటుచేసుకుంది. వీరంతా దైవదర్శనం…

వార్తలు

నేడు చంద్రబాబు ఢిల్లీ ప‌య‌నం

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా బీజేపీ అగ్రనేతలతో కేంద్ర మంత్రి పదవులపై చర్చించనున్నారు. అదేవిధంగా ఈ 26న జరిగే మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనన్నారు.