Wednesday, 4 November 2026

August 2015

సీమాంధ్ర

పశ్చిమగోదావరి : భీమవరం ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి

 భీమవరం, ఆగస్టు 20 : భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. ఆసుపత్రిలో డాక్టరు కాకుండా సిబ్బంది కాన్పు చేయటం వల్లనే బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు

సీమాంధ్ర

ప్రకాశం : పొలాల్లో వేటకు వెళ్లి…విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి

 రాచర్ల, ఆగస్టు 20 : రాచర్ల మండలం ఆకవీడు గ్రామ పొలాల్లో వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్‌ షాక్‌తో మరణించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు.

సీమాంధ్ర

విజయవాడకు 554 మంది ఆర్టీసీ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) పరిపాలన సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి విజయవాడ నుంచే నిర్వహించనున్నారు. నిన్నటి వరకు ఇక్కడ క్యాంపు కార్యాలయమే అనుకున్నా.. విజయవాడ లోని ‘ఆర్టీసీ భవన్‌’ నుంచే శాశ్వత పరిపాలన జరుగుతుందని…

సీమాంధ్ర

అత్తను హతమార్చిన అల్లుడికి జీవిత ఖైదు

తెనాలి: కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి ఎం.వెంగయ్య బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలానికి…

మెదక్

మెదక్‌ జిల్లాలో మహిళ ఆత్మహత్య

 మెదక్‌, ఆగస్టు 20 : పాపన్నపేట మండలం కుర్తివాడలో లావణ్య అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి భర్త, అత్త, మామ పరారయ్యారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు స్పందించడం లేదని జిల్లా…

ఆదిలాబాద్

తెలంగాణ పల్లె ప్రజల్లో వెల్లివిరిసిన చైతన్యం…

బెజ్జూరు రూరల్‌, ఆగస్టు 20 : నిత్యం పీకల దాకా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్న తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా మారుమూల పల్లె ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసింది. రాష్ట్రంలో సారాను మళ్లీ ప్రవేశపెడతామని తెలంగాణ సర్కారు ప్రకటించిన…

హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాద్, ఆగస్టు 20 ‌: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టీఆర్‌ఎస్వీ, జాగృతి విద్యార్థి నేతలు నిరుద్యోగులను మోసం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు టీఆర్‌ఎస్వీ,జాగృతి విద్యార్థి నేతలు నవీన్‌గౌడ్‌, రామ్మోహన్‌ను అరెస్ట్ చేశారు.

మహబూబ్ నగర్

ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్ట్…ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌,ఆగస్టు 20 : జిల్లాలోని కొడంగల్‌ మార్కెట్‌యార్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం మార్కెట్‌యార్డులోని ఓ గోదాము శంకుస్థాపనకు మంత్రి జూపల్లితో పాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం తన అనుచరులతో కలిసి…

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 347 గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్, ఆగస్టు 20 : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో 347 గ్రాముల బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి వచ్చిన తమిళనాడు ప్రయాణికుడి వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో మోసం

వనస్థలిపురం, ఆగస్టు 20 : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను కొందరు విద్యార్థి సంఘాల నేతలు మోసం చేశారు. ఉద్యోగాల పేరిట మోసం చేసిన నవీన్‌గౌడ్‌, రామ్మోహన్‌లను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.