Wednesday, 4 November 2026

July 2022

Featured News

ఇడుపులపాయలో వైఎస్‌కు ఘనంగా నివాళి

నివాళి అర్పించిన వైఎస్‌ కుటుంబ సభ్యులు తండ్రిని తలుచుకుంటూ జగగన్‌ భావోద్వేగ ట్వీట్‌ కడప,జూలై8 (జనం సాక్షి): మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ…

Featured News

వైఎస్‌ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం

ఆర్బీకెల ద్వారా పలు కార్యక్రమాల అమలు అమరావతి,జూలై8(జనం సాక్షి): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో…

ఖమ్మం

వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మహిళా కాంగ్రెస్.

బూర్గంపహాడ్ జూలై 08(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షరాలు బర్ల నాగమణి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత  కాంగ్రెస్…

Featured News

గౌరవ అధ్యక్షురాలుగా తప్పుకున్న విజయమ్మ

ప్లీనరీ వేదికగా పార్టీ పదవికి రాజీనామా ప్రకటన ఎపిలో జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని వెల్లడి తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తన రాజీనామాపై ముందే వక్రీకరణలు రావడదం దురదృష్ఠకరం భావోద్వేగంగా మాట్లడుతూ తప్పకుంటున్నట్లు వెల్లడి…

Featured News

పోడుభూముల పోరాటం తీవ్రం కోయపోషగూడెంలో మరోమారు ఉద్రిక్తత భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న గిరిపుత్రుల ఆందోళన హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి): రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్‌ ఆపీసర్ల…

జిల్లా వార్తలు

ప్రపంచ మానవ హక్కుల సంఘం మహబూబాబాద్ జిల్లా వింగ్ ఛైర్మన్ గా బయ్యారంకు చెందిన చల్లా గోవర్ధన్

ప్రపంచ మానవ హక్కుల సంఘం మహబూబాబాద్ జిల్లా వింగ్ ఛైర్మన్ గా బయ్యారంకు చెందిన  చల్లా గోవర్ధన్* బయ్యారం,జులై8(జనంసాక్షి): ప్రపంచ మానవ  హక్కుల సంఘం జాతీయ ఛైర్మన్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆదేశాలమేరకు తెలంగాణరాష్ట్రం,…

Featured News

పదవి అంటే అధికారం కాదు.. ప్రజల విూద మమకారం మాత్రమే మూడేళ్ల పాలనలో తాము అదే నిరూపించాం ప్రజలకు పాలనను చేరువ చేసి చూపాం సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి గడపను తట్టాం మన మేనిఫెస్టోనుచూస్తేనే భయపడే స్థితిలో టిడిపి పావురాలగుట్టలో మొదలైన సంఘర్షణతో నా వెన్నంటి నడిచారు మన విజయాన్ని గజదొంగల పార్టీవారు ఆపలేరు వైసిపి ప్లీనరీలో సిఎం జగన్‌ ఉత్సాహపూరిత ప్రసంగం గుంటూరు,జూలై8(ఆర్‌ఎన్‌ఎ): పదవి అంటే అధికారం కాదు.. ప్రజల విూద మమకారం అని నిరూపించామని సిఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ మూడేళ్లలో ప్రజల సేవకు అంకితం అయ్యామని అన్నారు. ఇచ్చిన హావిూని నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపనపడ్డామని అన్నారు. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో హావిూలు ఇచ్చి మాయం చేసే పార్టీలను చూశాం. ప్రజలు నిలదీస్తారేమో నని టీడీపీ మేనిఫెస్టోని మాయం చేసింది. ఆ పరిస్థితి నుంచి మేనిఫెస్టో అంటే అమలు చేసే ప్రతిజ్ఞగా చూపించాం. మన మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి 95 శాతం హావిూలు అమలు చేశాం. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చింది. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌ చేస్తున్నా. ఈ 13ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. నాన్న నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం నా చేయి ఎప్పుడూ వదల్లేదు. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడని టిడిపిని ఉద్దేశించి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెప్తున్నానని జగన్‌ అన్నారు.. ఈ మూడేళ్ల ప్రయాణం ఎన్నో పోరాటాల ప్రస్థానం. రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని నిరూపించింది మన పాలన. మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్నికుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదు. నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడు నా చేయి వీడలేదు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్‌ అన్నారు. దుష్టచతుష్టయం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల్ని, వాటికి అబద్దాలు జోడిరచి ఎల్లోవిూడియా ప్రచారం చేస్తోంది. గతంలో రాష్టాన్న్రి దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించింది. ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో విూడియా, ఎల్లో సోషల్‌ విూడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక లేదు. మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్‌ అన్నారు. మేనిఫెస్టోలను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించి పాలన చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చిన పార్టీ వైసీపీ అని అన్నారు. వివక్ష, కరప్షన్‌ లేకుండా పారదర్శక పాలన అందిస్తు న్నామని చెప్పుకొచ్చారు. పరిపాలన సంస్కరణలను చేసి చూపిన పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.అన్ని రంగాల్లోనూ సంస్కరణలు తీసుకువచ్చామని, ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చామన్నారు. కరోనా తీవ్రతలోనూ ఆర్థికంగా దెబ్బతినకుండా చూశామని అన్నారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా తాము చెల్లించామని తెలిపారు. లంచాలు, అవినీతికి తావులేకుండా పాలన అందిస్తున్నామన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్నా కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు కలిసి దుష్పచ్రారం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హావిూల్లో 95 శాతం అమలు చేశామని అన్నారు. మన గెలుపు ఆపడం ఈ గజదొంగల తరం కాదు అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జగన్‌ ప్రసంగానికి కార్యకర్తల నుంచి స్పందన భారీగా వచ్చింది. చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు.

పదవి అంటే అధికారం కాదు..   ప్రజల విూద మమకారం మాత్రమే మూడేళ్ల పాలనలో తాము అదే నిరూపించాం ప్రజలకు పాలనను చేరువ చేసి చూపాం సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి గడపను తట్టాం మన మేనిఫెస్టోనుచూస్తేనే భయపడే స్థితిలో…

జిల్లా వార్తలు

గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని ధర్నా.

మల్కాజగిరి.జనంసాక్షి.జూలై 8 టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుకు  నిరసనగా ధర్నా నిర్వహించి రోడ్డు పై వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని…

Featured News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు

సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి భద్రాద్రి కొత్తగూడెం,జూలై8(జనంసాక్షి): మణుగూరులో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం…

Featured News

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం

వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు మృతి అప్రమత్తంగా ఉండాలని కోరిన సాగర్‌ ఎమ్మెల్యే భగత్‌ నల్లగొండ,జూలై8( జనంసాక్షి): ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నల్లగొండ పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.…