Friday, 6 November 2026

ఆదిలాబాద్

సిఎం పర్యటనతో కార్మిక నేతల అరెస్టు

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): కాగజ్‌నగర్‌ ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ విద్యుత్తు ప్లాంటు విస్తరణ పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజకు రానుండంతో  సిర్పూరు-కాగజ్‌నగర్‌ కాగితపుమిల్లు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తుమ్మ రమేశ్‌, జాన్‌ప్రకాశ్‌రావు, లోకేశ్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు…

జైపూర్‌ విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలోని జైపూర్‌ మండలం పెగడపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పటవుతున్న 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ మూడో యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. మూడు సంవత్సరాల్లో ఈ విద్యుత్‌ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి…

రెండు పెన్షన్లు రావని గుర్తుంచుకోండి

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఒకరికి ఒకటే పెన్సన్‌ వస్తుందని, రెండు పొందుదామనుకునే వారు అలాంటి ఆలోచన మానుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. తప్పుడు వివరాలు ఇచ్చేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెండురకాల పింఛన్లను ఇప్పిస్తామని కొంతమంది దళారీ నాయకులు పుట్టుకొచ్చే…

లోక్‌ అదాలత్‌ సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): లోక్‌ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇన్ఛార్జి జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు 14న జిల్లావ్యాప్తంగా జరిగే  అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.  జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు…

వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని డ్వామా పీడీగా  బాధ్యతల స్వీకరించిన శ్రీనివాస్‌ ప్రకటించారు. ఇదే తమ ప్రాధాన్యమని అన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస(డ్వామా) పథక సంచాలకులుగా కె.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించాక ఆయన మరుగుదొడ్ల…

పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో పబ్లిక్‌ పరీక్షల ఫీవర్‌ మొదలయ్యింది. ఇప్టపికే ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులను సన్నద్దం చేశారు. ఇక టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు వారిని సిద్దం చేస్తున్నారు. ఈ తడవ ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిని సన్నద్దం చేశారు.…

టీఆర్‌ఎస్‌ నాయకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ జిల్లా దండెపల్లి మండలం ముత్యంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు లక్ష్మణ్‌ మృతిచెందారు. ఆర్టీసీ బస్సు- కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ అక్కడిక్కడే…

ఆదిలాబాద్‌ బయలుదేరిన కేసీఆర్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు పయనమయ్యారు. మెదక్‌ జిల్లాలోని ఆయన ఫాంహౌస్‌ నుంచి బయలుదేరిన సీఎం ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌ విస్తరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు…

పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెగడపల్లిలో ఏర్పాటు చేయనున్న 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు వేణుగోపాలాచారి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

జైపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల వాహనాల అడ్డగింత

ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ పవర్‌ప్లాంట్‌ ఎదుట డిపెండెంట్లు, కాంట్రాక్ట్‌ కార్మికులు కలిసి ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేతల వాహనాలను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పనిచెప్పారు.