Friday, 6 November 2026

ఆదిలాబాద్

బాలికల క్రీడా సమ్మేళనం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌మిల్లు క్రీడా మైదానంలో ప్రాథమిక స్థాయి బాలికల క్రీడా సమ్మేళనం నిర్వహించారు. నియోజక వర్గంలోని పలు మండలాల విద్యార్థినులు హాజరయ్యారు.

16నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

కాగజ్‌నగర్‌: ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వవిద్యాలయం ఈ నెల 16నుంచి 19 వరకు పట్టణంలోని సిర్పూర్‌ పేపరుమిల్లు వెల్సర్‌ సంక్షేమ ఫంక్షన్‌ హాల్‌లో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్వదర్శనం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధులు మనీష, విజయ లక్ష్మీలు తెలిపారు. దేశంలోని…

బేగామలో విద్యార్థుల వీడ్కోలు సభ

బజార్‌హత్నూర్‌: మండలంలోని బేగామ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన…

వెల్లూరులో అగ్నిప్రమాదం

రూ.5లక్షల ఆస్తి నష్టం జెజ్జూరు: మండలంలోని వెల్లూరి గ్రామంలో చౌదరి గోపాల్‌కు చెందిన ఇల్లు బుధవారం తెల్లవారు జామున విద్యుదాఘాతానికి గురై దగ్థమయ్యింది. ఈ మంటల్లో వంద క్వింటాళ్ల పత్తి, 20 బస్తాల వడ్లు, క్వింటాల్‌ పెసలు, రూ.5వేల…

నిర్మల్‌లో వైకాపా ఆవిర్భావ వేడుకలు

నిర్మల్‌: నిర్మల్‌లో మంగళవారం వైకాపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో…

విద్యా వైజ్ఞానిక మేళా ప్రారంభం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక మేళాను మున్సిపల్‌ కమిషనర్‌ రాజు ప్రారంభించారు. విద్యార్థులు పలు స్టాళ్లను ఏర్పాటు చేయగా వివిధ పాఠశాలల విద్యార్థులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు…

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

హీరపూర్‌ (ఇంద్రవెల్లి), న్యూస్‌టుడే: ఇంద్రవెల్లి మండలం హీరపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆత్రం రాధ రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రత్యేక అధికారి పవార్‌ సీతారాం, వ్యాయమా ఉపాధ్యాయురాలు అత్రం రాజ్యలక్ష్మీ తెలిపారు.…

కోర్టుకు హాజరుకాని అక్బరుద్దీన్‌

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిర్మల్‌ టౌన్‌, న్యూస్‌టుడే: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మంగళవారం నాటి విచారణకు హాజరుకాలేదు. గతంలో జరిగిన విచారణ మేరకు మంగళవారం అయన నిర్మల్‌ న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది. అయితే…

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…

అగ్నిప్రమాదంలో మహిళ మృతి

బైంసా: పట్టణంలోని బట్టిగల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మహిళ మృతి చెందారు. బటిగలిలోని అష్వాక్‌, జరీనాభాను తమ కుమారుడితో కలిసి ఇంటో ఉండగా విద్యుత్తు లేకపోవడంతో క్యాండిల్‌ వెలిగించుకున్నారు. రాత్రి 2గంటల సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో…