Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్

 మహబూబ్ నగర్: రవాణా, భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర రవాణా కార్మికులు ఇచ్చిన ధర్నా పిలుపులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ఆపరేటర్లు బంద్ నిర్వహిస్తున్నారు. తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురాకుండా నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.…

లారీ-బస్సు ఢీ.. ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం: ఈతకెళ్లి ఏడుగురి మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఏడుగురు మృతిచెందారు. ఆమనగల్లు మండలం చారికొండ ్ణొరమ్మ చెరువులో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీరంతా హైదరాబాద్‌ నగరంలోని మేడ్చల్‌ రోడ్‌లో…

దివిటిపల్లి వద్ద ఆటో – కారు ఢీ..నలుగురు మృతి..

మహబూబ్ నగర్ : దివిటిపల్లి వద్ద ఎన్ హెచ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆటో – కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వర్షం

మహబూబ్ నగర్: జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. గత అర్ధరాత్రి గంటపాటు కొడంగల్ నియోజకవర్గంలో కుండపోత వర్షం పడింది. నారాయణపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు కురిశాయి. అకాల వర్షానికి వరి, మామిడి…

ప్రమాదవశాత్తూ రైతు మృతి

దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఓ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ట్రాక్టర్ కింద పడి ఒక రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నార్లోనికుంట్ల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు…

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస

మహబూబ్ నగర్: నాగర్ కర్నూలులో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మండల కాంగ్రెస్ కార్యకర్తల వల్లభరెడ్డి, హబీబ్, గౌస్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వారి అనుచరులు గొడవకు దిగారు. ఎంపి నంది ఎల్లయ్య…

సిద్ధయ్య..కన్నీటి నివాళి..

 మహబూబ్ నగర్ : వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధయ్య స్వగ్రామమైన జడ్చర్లలో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు చేశారు.…

సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం..

మహబూబ్ నగర్: ఎస్ ఐ సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం అయింది. సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతిమయాత్రలో పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయనేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతోపాటు పలువురు పాల్గొన్నారు. సిద్ధయ్య మృతితో జడ్చర్లలో విషాదఛాయలు…

మ.12 గంటలకు ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు

మహబూబ్‌నగర్ : సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. స్వస్థలమైన జడ్చర్లలో సిద్ధయ్య అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో సిద్ధయ్య అంత్యక్రియలు…