Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

‘సడక్‌ బంద్‌’ ఆగదు : ఛైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌ : ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సడక్‌ బంద్‌ ఆగదని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం అన్నారు. మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 24న సడక్‌ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నికల వాయిదా

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్‌ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.

రెండోరోజు జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌజ్‌ నుంచి ప్రారంభమైంది. బస్సు యాత్రను జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవోల…

సీమాంధ్ర నేతలకు తలొగ్గే షిండే వ్యాఖ్యలు : ఛైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఇస్తే దేశంలో ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్నది ఒట్టిమాటేనని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్‌ చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీమాంధ్ర నేతలకు తలొగ్గే హోంమంత్రి షిండే…

ఆటో, లారీ ఢీ.. ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ : హన్వాడ మండలం నైనోనిపల్లి వద్ద ఈ తెల్లవారుజామున లారీ,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ నుంచి దామరగిద్దకు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…

విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు

మహబూబ్‌నగర్‌ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్‌ రెేంజ్‌ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.

మహబూబ్‌నగర్‌లో 144 సెక్షన్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సహా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు

బిజినేపల్లి: మహబూబ్‌నగర్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్‌ఫార్మర్‌ ఢీకొట్టింది. ఆ  సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

బీఎస్‌ఎఫ్‌ జవానుపై దుండగుల కాల్పులు

మహబూబ్‌నగర్‌ : బీఎస్‌ఎఫ్‌ జవానుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పెద్దమందడి మండలం జగత్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. గాయపడిన జవానును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బస్సు బోల్తా : 20 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం నాగవరం తండా సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారికి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.