Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

పత్తి మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన

మెడ్జిల్‌: మండలపరిధిలోని వూరుకొండపేట పత్తిమిల్లు ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఒత్తిళ్లకు పాల్పడుతూ కార్మికులను ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. వీరికి బీఎంఎన్‌ నేతలు మద్దతు తెలిపారు.

పాలమూరు డీఆర్సీ మీటింగ్‌లో జూపల్లి నిరసన

మహబూబ్‌నగర్‌ : జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  జూపల్లి కృష్ణారావు నిరసన వ్యక్తం చేశారు. డీఆర్సీ సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించక పోవడంతో ఆయన సమావేశంలోనే బైటాయించి ధర్నా చేశారు. దీంతో సమావేశంలో ఉధ్రిక్తత ఏర్పడింది.

డీవీఆర్‌ కళాశాలలో జాకీ హేమంత్‌ సందడి

సంగారెడ్డి (మున్సిపాలిటీ): సంగారెడ్డి మండలం కాశీపూర్‌లోని డీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వేడుకలో రేడియో మిర్చి జాకీ హేమంత్‌ సందడీ చేశారు. కళాశాల విద్యార్థులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులను ఉత్సాహ పరిచారు. రేపటితో కళాశాల ఉత్సవాలు ముగిస్తాయని ప్రిన్సిపాల్‌…

బాంబు పేలుడు ఘటనలో మృతుని కుటుంబానికి చెక్కు అందజేత

జడ్చర్ల: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన జడ్చర్లకు చెందిన హరీష్‌కార్తీక్‌ కుటుంబానికి జిల్లా కలెక్టరు గిరిజా శంకర్‌, జేసీ శర్మన్‌ శుక్రవారం రూ.6లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ మృతుని సోదరుడికి ఉద్యోగ అవకాశం…

అధికారులను నిలదీసిన గ్రామస్థులు

కోడేరు: మండల పరిధిలోని ఖానాపూర్‌ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక అధికారుల బృందాన్ని గ్రామస్థులు శుక్రవారం నిలదీశారు. ఖానాపూర్‌ గ్రామంలో ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘పల్లెవికాసం’ కార్యక్రమం నిర్వహించారు. తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం సమస్యలు తీర్చాలని…

డీసీఎంను అడ్డగించి రూ.5.50లక్షలు దోపిడీ

బొమ్మరాజుపేట: డీసీఎంలో వస్తున్న వ్యాపారిని అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5.50లక్షలను దోచుకెళ్లారు. ఏర్పుమళ్ల గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యాపారి మహబూబ్‌నగర్‌లో ధాన్యాన్ని విక్రయించగా వచ్చిన రూ.5.50లక్షలను డీసీఎం వాహనంలో తీసుకొస్తుండగా ఈర్లపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున…

ఎర్లపల్లి వద్ద రూ.5.50 లక్షలు దోపిడి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బొంరాన్‌పేట మండలం ఎర్లపల్లి వద్ద మంగళవారం ఉదయం దోపిడి జరిగింది.దుండగులు డీసీఎంను అడ్డగించి అందులో ఉన్న వారి కాళ్లలో కారంచల్లి రూ. 5.50 లక్షలను దోచుకెళ్లారు.

పాతకక్షలతో ఇద్దరి హత్య

మహబూబ్‌నగర్‌ : ధరూర్‌ మండలం మన్నాపురం గుట్ట సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో వీరిని ప్రత్యర్ధులు  హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. మృతులను జీరబండ గ్రామానికి చెందిన నర్సింహులు (60), చింతరేవుల గ్రామానికి…

భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో భాజపా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వనపర్తిలో భాజపా ఆధ్వర్వంలో బంద్‌

వనపర్తి (పట్టణం): బాంబు దాడులను నిరసిస్తూ వనపర్తిలో భాజపా, ఏబీవీపి. ఆర్ప్‌న్‌ఎన్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తున్నారు.