Thursday, 5 November 2026

మెదక్

గ్రీవెన్స్‌ సెల్‌కు 52 విజ్ఞప్తులు

సంగారెడ్డి పట్టణం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌కు 52 అర్జీలు అందాయి. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన ఫిర్యాదులు విజ్ఞప్తులు వారంలోగా పరిష్కరించాలని సూచించారు.

వ్యాట్‌ను రద్దుచేయాలని కలెక్టరును కలిసిన వ్యాపారులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు సోమవారం కలెక్టరు దినకర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతిపత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా చేస్తానని వ్యాపారులకు హామీ…

ప్రమాదవశాత్తూ రెండు పూరిళ్లు దగ్ధం

వెల్దుర్తి: మండలంలోని హస్తాలపూర్‌ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో రూ. 3లక్షలు ఆస్తి జరిగినట్లు బాధితులు తెలిపారు. గొల్ల నరసింహులు, గొల్ల మల్లేశం వ్యక్తులకు చెందిన పూరిళ్లు ప్రమాదవశాత్తూ దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో…

రూ. 2.18కోట్లతో గ్రంథాలయ బడ్జెట్‌ ఆమోదం

సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రంథాలయ బడ్జెట్‌ సమావేశం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్‌ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో జరిగింది. రూ.2.18 కోట్లతో బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కార్యదర్శి వసుంధర, సభ్యులు బాల కిషన్‌, శ్రీనివాస్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

మెదక్‌ పట్టణంలోని కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు

మెదక్‌: పట్టణంలోని జేఎన్‌ రోడ్డులో కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు జరిగాయి. కిరాణాదుకాణంలో రూ.2.50లక్షల, బంగారు ఆభరణాల లాకర్‌ను పగలకొట్టి అరకిలో బంగారాన్ని చోరీ చేశారు. సంఘటన స్థలాన్ని మెదక్‌ పట్టణ సీఐ విజయ్‌కుమార్‌, సిబ్బంది సందర్శించి ఆధారాలు…

వేతనాల కోసం కార్మికుల ఆందోళన

కొహీర్‌: మండలంలోని కవేలి కూడలిలో ఉన్న రాకూల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిశ్రమంలో వేతనాలు చెల్లించాలటూ తాత్కాలిక కార్మికులు ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా కాంట్రాక్టర్‌ వేతనాలు చెల్లించడం లేదని ధర్నాకు దిగారు. వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని కార్మికులు…

ప్లానింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

సంగా రెడ్డి మున్సిపాలిటీ: స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో కల్టెరు దినకర్‌బాబు ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్లానింగ్‌ కమిటీ సమావేవం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్ణారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో…

జహీరాబాద్‌ చేరుకున్న సీఎం

జహీరాబాద్‌: ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చేరుకున్నారు. జహీరాబాద్‌ వద్ద మహీంద్రా ట్రాక్టర్‌ ప్లాంటును ముఖ్యమంత్రి మరికా సేపట్లో ప్రారంభించనున్నారు.

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మెదక్‌: ఇందోళ్‌ మండలంలోని సంగుపేట గ్రామంలో కొండగారి సాయిలు అనే ఇంటర్‌ విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు..  పరీక్షకు హాల్‌ టిక్కెట్‌ ఇవ్వలేదని మనస్తాపంతో సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఆరోపిస్తున్నారు. జోగిపేటలోని క్రాంతి జూనియర్‌ కళాశాలలో…

నల్లకుంటను సందర్శించిన కేంద్ర పీసీబీ అధికారులు

గుమ్మడిదల: దోమడుగు గ్రామ పరిధిలోని నల్లకుంటను కేంద్ర పీసీబీ అధికారులు డాక్టర్‌ జనార్థన్‌, మహిమలు సందర్శించారు. కాలుష్యం బారిన పడిన నల్లకుంట నుంచి మట్టి, నీటి నమూనాలను సేకరించారు. పరీక్షానంతరం కాలుష్య పరిమాణాలను వెల్లడిస్తామని తెలిపారు.