Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

మూడోసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా

ప్యాంగ్‌యాంగ్‌: ఆంక్షలను లేక్కచేయకుండా ఉత్తరకొరియా మూడోసారి అణుపరీక్షలు నిర్వహించింది. అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడాన్ని గుర్తించినట్లు పలు దేశాలు వెల్లడించాయి. ఉత్తర కోరియాలో 5.1 తీవ్రతతో కూడిన కృత్రిమ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తాము గుర్తించినట్లు దక్షిణ కొరియా…

28న రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న పోవ్‌

వాటికన్‌ సిటీ : పోవ్‌ బెనెడిక్ట్‌-16 ఈ నెల 28న రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాలవల్ల ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వాటికన్‌ అధికార ప్రతినిధి య ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయంలో పోవ్‌ బెనెడిక్ట్‌-16…

ప్రవసం కోసం ఆస్పత్రిలో చేరిన భార్య

గుండెపోటుతో భర్త మృతి న్యూయార్క్‌లో ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్‌కు చెందిన క్రాంతికుమార్‌ ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భార్య వాణి ప్రసవం కోసం స్థానిక ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే క్రాంతి మృత్యువాతపడ్డాడు.…

55 ఏళ్ల తర్వాత జరిమానాతో సహా తిరిగొచ్చిన పుస్తకం

న్యూయార్క్‌ : ఆ పుస్తకాన్ని గ్రంధాలయంనుంచి తీసుకెళ్లినవారెవరో కానీ వారి వారసులకు మాత్రం పుస్తకాల విలువ బాగా తెలిసినట్లే ఉంది. అందుకే 55 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన ఒక పుస్తకాన్ని జరిమానా డబ్బుకు సరిపోను చెక్కుతో సహా కలిపి…

సోలోమన్‌ దీవులను తాకిన సునామీ

హోనేరా : ఆస్ట్రేలియాకు సమీపంలోని సోలోమన్‌ దీవుల్లో సంభంవించిన భారీ భూకంపం సునామీకి దారి తీసింది. ఉవ్వెత్తున్న లేచిన భారీ అలలు దక్షిణ పసిఫిక్‌ దీవుల్లోని తీరప్రాంతాలను చేరి పలు నివాసాలను ధ్వంసం చేశాయి. అయితే సోలోమన్‌లోని పలు…

‘ఏరో ఇండియా -2013’ ప్రారంభం

బెంగళూరు: ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ‘ఏరో ఇండియా -2013’ కార్యక్రమం బెంగళూరులో ప్రారంభమైంది. నగర శివారులోని యలహంక వైమానికి స్థావరంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ మంత్రి ఏకే అంటోనీ ప్రారంభించారు. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన యుద్ధ…

శాంతాక్రజ్‌ దీవుల్లో భారీ భూకంపం

శాంతాక్రజ్‌ : అమెరికాలోని శాంతాక్రజ్‌ దీవుల్లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.9గా నమోదైంది. దీంతో దక్షిఫ పసిఫిక్‌ దీవుల్లో సునామీ హెచ్చరికలను పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం జారీ చేసింది. హవాయి దీవులకు…

ఫేస్‌బుక్‌లో వివాదాస్పద కార్టూన్లు : వ్యక్తి అరెస్టు

లక్నో : ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ తదితరులపై విద్వేషపూరిత అంశాలు ఫేస్‌లబుక్‌లో పోస్ట్‌ చేసినందుకు ఆగ్రా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సంజయ్‌ చౌదురి అనే…

అండమాన్‌లో భూకంపం

పోర్ట్‌బ్లేర్‌ : అండమాన్‌ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. వీటి తీవ్రత రిక్టర్‌స్కేల్‌ 4.9గా నమోదైంది.

కూలిన చిన్న విమానం

కారకన్‌: దక్షిణ అమెరికాలోని వెనిజులా తీరంలో చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.