Saturday, 28 November 2026

హైదరాబాద్

బోర్డు తిప్పేసిన కేవీ జ్యుయెలర్స్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని కేవీ జ్యుయెలర్స్‌ బోర్డు తిప్పేసింది. రూ. మూడు కోట్ల మేర వినియోగదారులకు టోకరా వేసినట్లు సమాచారం. బంగారం, నగదుతో  యజమాని పరాపయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గాంధీభవన్‌ ముట్టడికి ఓయూ జేఏసీ యత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చాకో చేసిన వ్యాఖ్యలపై ఓయూ జేఏసీ మండిపడంది. గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ఓయూ జేఏసీ నేతలు యత్నించారు. చాకో దిష్టిమ్మను దహనం చేసి కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించడంతో పోలీసులు…

కళంకిత మత్రులపై రేపు రాష్ట్రపతిని కలవనున్న తెదేపా

హైదరాబాద్‌, జనంసాక్షి: కళంకిత మంత్రులపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని రేపు రాష్ట్రరాష్ట్రపతిని తెదేపా బృందం కలవనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎంపీలు. ఎమ్మొలేలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతిని…

నీలం సంజీవరెడ్డి చిత్రంలో పోస్టల్‌ కవర్‌ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకులు ప్రారంభమయ్యాయి. రవీంధ్రభారతిలో నీలంసంజీవరెడ్డి చిత్రంలో పోస్టల్‌ కవర్‌ను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం

మెదక్‌జిల్లా, జనంసాక్షి: చేగుంట ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు రికార్డులు కాలొబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంపీ వివెక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.

సెప్టెంబర్‌లో అమెరికా పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టనున్నారు. మన్మోహన్‌ వాషింగ్ఘన్‌తో పాటు న్యూయార్క్‌లో పర్యటిస్తారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశానికి హాజరవుతారు.

కుటుంబాల కలహాలతో ముగ్గురు ఆత్మహత్య

అనంతపురం, జనంసాక్షి: నగరంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ మండలం అల్మాస్‌గూడలోని ఓ బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి జరిగింది. దుండగులు 40 తులాల బంగారం , కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు…

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృతి

ఖమ్మం, జనంసాక్షి: వి.ఆర్‌.పురం మండలం ఇప్పూర్‌లో పర్యాటక బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.