Wednesday, 25 November 2026

హైదరాబాద్

అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి మృతి

నాగ్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందింది. నాగ్‌పూర్‌లోని ఐసీయూలో ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడి చిన్నారి నిన్న సాయంత్రం చనిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఘన్‌సోర్‌ పట్టణానికి చెందిన బాలికను ఏప్రిల్‌ 17న…

శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు

తిరుమల: మంత్రులు శైలజానాధ్‌, పార్థసారధి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అలయానికి చేరుకున్న మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అలయ అర్చకులు వేదాశీర్వచనాలు పలికి…

లీగల్‌ నోటీసులు అందలేదు : మంత్రి ఆనం

నెల్లూరు: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన లీగల్‌ నోటీసులు తనకు ఇంకా అందలేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. లీగల్‌ నోటీసులు అందిన తర్వాత సమాధానం చెప్తామన్నారు. జగన్‌ను ఉరి తీయాలని ఆనం వ్యాఖ్యానించిన…

ఈ చలాస్‌ ప్రారంభించిన డీజీపీ

హైదరాబాద్‌: డీజీపీ దినేశ్‌ రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లో ఈ చలాస్‌ విధానాన్ని ప్రారంభించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ను అరికట్టడంలో హైదరాబాద్‌ పోలీసులు సఫలమయ్యారని డీజీపీ పేర్కోన్నారు.

అగ్ని ప్రమదంలో 15 గడ్డి వాములు దగ్దం

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరకంపాడు గ్రామ శివారులో రైతులు పశుగ్రాసం కోసం ఏర్పాటు చేసుకున్న 15 గడ్డి వాములు సోమవారం మధ్యాహ్నం అగ్నికి అహుతయ్యాయి. వీటి విలువ సుమారు 3లక్షలు ఉంటుందని రైతులు చెప్తున్నారు. సమాచారం…

అప్పు తీర్చలేదని విద్యార్థి కిడ్నాప్‌?

హైదరాబాద్‌: కాకినాడలో ఇంటర్‌ విద్యార్థి బ్యోతుల రామును వడ్డీ వ్యాపారులు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. రాము తల్లిదండ్రులు తీసుకున్న అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారులు రామును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. రాము కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు.

ఎరువులు సకాలంలో అందించేందుకు చర్మలు

-మార్క్‌ఫెడ్‌ చైర్యన్‌ కంచి రామారావు హైదరాబాద్‌ రాష్ట్రంలో ఈ ఏడాది రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య కంచి రామారావు వెెల్లడించారు. గత…

నెల్లూరు జిల్లాలో అధికారుల సస్పెన్షన్‌

నెల్లూరు: రావూరు ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ, గోనుపల్లి పంచాయితీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పర్యటన సందర్బంగా అధికారులు ప్రదర్శించిన బాధ్యతారాహిత్యమే ఈ సస్పెన్షన్‌కు కారణమని అధికారులు పేర్కొన్నారు.

సంగారెడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి

సంగారెడ్డి: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సంగారెడ్డిలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి ప్రయాణించిన ప్రత్యేక హెలికాప్టర్‌ కంది పరిధిలోని ఐఐటి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద…

గ్రూప్‌-1 ఫలితాలపై హైకోర్టుకు ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రూప్‌-1 ఫలితాలపై స్టే ఎత్తివేయాలంటూ ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఫలితాల వివాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను సమర్పించాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.