Sunday, 22 November 2026

హైదరాబాద్

కేటీపీపీలో సాంకేతిక విద్యుదుత్పత్తికి అంతరాయం లోపం

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో సాంకేతిక లోపం  తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకై 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

సీఎంతో భేటీ కానున్న ఏరాసు, జేసీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి , మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమచారం.

ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి

విశాఖపట్నం: ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మంగళవారం సాధారణ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా…

లభ్యమైన ఇంటర్‌ విద్యార్థి ఆచూకీ

నిజామాబాద్‌: కామారెడ్డి పట్టణానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కీర్తన (17) ఆచూకీ ముంబయిలో లభ్యమైనట్లు సమాచారం. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ముంబయికి బయలుదేరి వెళ్లారు. పట్టణంలో విద్యానగర్‌ కాలనీకి చెందిన కీర్తన హైదరాబాద్‌ నిజాంపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో…

నేడు శ్రీకాకుళంలో వంశధార ట్రైబ్యునల్‌ పర్యటించనున్న కమిటీ

శ్రీకాకుళం: ఒడిశాతో రాష్ట్రానికి గల జల వివాదాలను పరిష్కరించేందుకు వంశధార ట్రైబ్యునల్‌ అత్యున్నత స్థాయి కమిటీ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. భామిని మండలం నేరడి బ్యారేజి ప్రతిపాదిత ప్రాంతంతోపాటు కాట్రగడ బి వద్ద సైడ్‌ వియ్యర్‌, హిర…

ప్రారంభమైన జలమండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: జల మండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. జంటనగరాల్లో తెరాస నుంచి ఎమ్మెల్యే హరీశ్‌రావు, తెదేపా నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి , కాంగ్రెస్‌ నుంచి మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు…

ఇంటర్‌ విద్యార్థి మనస్థాపంతో మూడు రోజులుగా ఆచుకిలేకపోయింది

ఎల్లారెడ్డిపేట: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలో తప్పానని మనస్థాపంతో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటకు చెందిన మంగళహారతుల రాకేశ్‌ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇంటర్‌ ఫలితాలు చూసుకోవడానికి బయటకు వెళ్లిన…

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్ట పోయింది. నిప్టీ 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

రెండో ఆటోలు ఢీకొన్ని చిన్నారి మృతి

ఖమ్మం: చర్ల మండలం ఆర్‌. కొత్త గూడెంలో ఈ ఉదయం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాంగ్రెస్‌ కార్యకర్తపై బాంబులతో దాడి

కడప : పెద్దముడియం మండలం సుద్దపల్లికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డిపై ప్రత్యేర్థులు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.