Sunday, 22 November 2026

హైదరాబాద్

2 గంటలకు వాయిదా వేసిన రాజ్యసభ

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 2…

ఎల్లుండికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ : 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒక సారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభకాగానే ప్రధాన పత్రిపక్షం భాజపాతోపాటు విపక్ష సభ్యులు నిరసన చేపట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో…

సోనియాతో సమావేశం కానున్న ప్రధాని

న్యూఢిల్లీ : 2జీ , బొగ్గుకుంభకోణం అంశాలపై పార్లమెంట్‌లో విపక్షాల దాడి నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు.

ప్రధాని రాజీనామా చేయాలన్న భాజపా

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఈ ఉదయం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. 2జీ వ్యవహారంలోకి మాజీ ప్రధాని వాజ్‌ పేయిని లాగడంపై నేతలు మండిపడ్డారు. ప్రధాని రాజీనామా…

కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై విచారణ చేపట్టనున్న లోకాయుక్త

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, అధికారులు లోకాయుక్త ముందు హాజరయ్యారు. కన్నెధార గ్రానైట్‌ గనులపై సర్వే చేయాలని కలెక్టర్‌ను…

తెదేపా నేతలు మద్దతు పలికిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఖమ్మం : బయ్యారం గనుల వ్యవహారంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెరాస నేతలు మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఖమ్మం బస్టాండ్‌ వద్ద సీపీఐ 48 గంటల…

ఏపీఐఐసీ అధికారులను విచారిస్తున్న సీబీఐ

హైదరాబాద్‌: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్‌ మేనేజర్‌ మూర్తి హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియర్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,100గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర…

విపక్షాల ఆంధోళన వల్ల రాజ్యసభను వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ: 2జీ, బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. సభ్యులు  శాంతించకపోవడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ఉ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.…

అల్వాల్‌లో యువకుడిని అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

హైదరాబాద్‌: అల్వాల్‌లో కార్తీక్‌ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు పోలీసులమని చెప్పి కార్తీక్‌ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.