Sunday, 22 November 2026

హైదరాబాద్

మంచి కథ దొరికితే నటిస్తా : జెనీలియా

హైదరాబాద్‌ : మంచి కథ దొరికినప్పుడు సినిమా చేయాడానికి తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్‌ నటి జెనీలియా తెలిపారు. ప్రస్తుతం సినిమా కథల అన్వేషణలో ఉన్నానన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లో మింత్రా కామ్‌ అనే సరికొత్త స్టార్‌ ఆండ్‌…

‘ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించము’ :సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు సింహాల తరలింపునకు సుప్రీం అనుమతిచ్చింది. అంతరించిపోయే దశలో ఉన్న సింహాలను ఆరు నెలల్లోగా మధ్యప్రదేశ్‌కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొండ దిగిన బంగారం ధర

కొండెక్కి కూర్చున్న బంగారం ధర ఒకే రోజు పది గ్రాములకు వెయ్యి రూపాయలకుపైగా తగ్గిపోయింది. కొండెక్కి కూర్చున్న బంగారం ఒక్కసారిగా తగ్గింది. ఒకే రోజు ఊహించనంత స్థాయిలో వెయ్యి రూపాయలకుపైగా తగ్గిపోయింది. 2011 తరువాత 10 గ్రాముల బంగారం…

కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులకు అస్వస్థత

మెదక్‌, జనంసాక్షి: జిన్నారంలోని హెటిక్‌ డ్రగ్స్‌ కంపెనీ భోజనశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: వనపర్తి మండలం నాగవరంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఇద్దరు బాలురు ఈతకు వెళ్లినట్లు సమాచారం. బాలుర తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

ఛార్జీషీట్ల తుది విచారణకు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు జగన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అన్ని ఛార్జీషీట్లను కలిసి తుది విచారణ జరపాలని సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఛార్జిషీటు దాఖలు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

నియోజకవర్గ కార్యకర్తలతో భేటీకానున్న గంగుల

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ నియోజకవర్గ కార్యకర్తలతో టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. గంగుల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవాళ సాయంత్రం కేసీఆర్‌తో గంగుల భేటీ కానున్నట్లు సమాచారం.

మా ఎంపీలు జీనియస్‌: గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీ కాంగ్రెస్‌ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్‌విన్‌ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తమ ఎంపీలు జీనియస్‌ అని ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసన్నారు.…

కరువుపై సమీక్షించనున్న కేంద్ర బృందం

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరువు పరిస్థితులు, అంచనాలపై అధికారులతో బృందం సమీక్షించింది.

మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించడానికి బస్సు యాత్ర నిర్వహిస్తున్న మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ తగిలింది. ఉప్పునూతల మండలం కొడికల్‌కు బస్సు యాత్ర చేరుకోగానే గ్రామంలోని మహిళలు బస్సును అడ్డుకున్నారు. జై తెలంగాణ,…