Sunday, 22 November 2026

హైదరాబాద్

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావు: ఏచూరి జోష్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: లోక్‌సభకు ముందస్తు ఎన్నిలు రావని సీపీఎం జాతీయ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సీతారాం ఏచూరి జోష్యం చెప్పారు. ఇవాళ ఆయన నగరంలో పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్‌లో…

ఏసీబీ వలలో అల్గునూరు వీఆర్వో

కరీంనగర్‌, జనంసాక్షి: ఏసీబీ వలకు ఓ అవినీతి వీఆర్వో చిక్కాడు. అల్గునూరు వోఆర్వో రమణ  ఓ వ్యక్తి నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,890 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,700 గా ఉంది. కిలో వెండి…

లక్ష్మీశ్రీనివాసరావు కేసు 18కి వాయిదా

న్యూఢిల్లీ : భార్య, పిల్లలు హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్ష్మీనివాసరావును సిఐడి అధికారులు పాటియాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

సచివాలయంలో ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌, ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆయన సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రైవేట్‌ ఆస్పత్రులు, నిమ్స్‌ డైరెక్టర్‌ వ్యవహారంపై చర్చించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులతో వ్యవహరించాల్సిన అంశంపై అధికారులకు ఆయన కొన్ని…

తెదేపా అధ్యక్షుడు జానపద కళలను ప్రోత్సహించాలి

చిలుకూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జానపద కళలను ప్రోత్సహించాలిన కోదాడ ఎమ్మెల్యే వేలేపల్లి చందర్‌రావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బిల్యానాయక్‌ అన్నారు. శనివారం మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మహిళా కోలాటాలు, గజ్జె పూజలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ…

వీఆర్వో కార్యాలయం ప్రారంభం

చిలుకూరు: మండలంలోని బేతవోలు గ్రామంలో వీఆర్వో కార్యాలయాన్ని మండల తాహసిల్దారు ఎన్‌. సూర్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు తమకు కావాల్సిన ధ్రువపత్రాలను వీఆర్వో కార్యాలయం నుంచి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో…

శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవలయంలో ఘనంగా పూజలు

చిలుకూరు: మండలంలోని రామాపురం గ్రామాలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మహిళలు శనివారం పాలపొంగళ్లతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఏటా ఉగాది పండుగకు ముందు శనివారం ఈ గ్రామంలో దేవాలయం వద్ద మహిళలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ…

హైదరాబాద్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బీజేపీ గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బర్కత్‌పురాలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. రానున్నది ఎన్నికల…

ఢిల్లీలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఇవాళ జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ జాతీయ అధక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సీనియర్‌ నేత అద్వానీ, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు.