Thursday, 19 November 2026

హైదరాబాద్

పోలవరంపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశం

హైదరాబాద్‌ పోలవరంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సచివాలయంలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, విదేశాల్లో పని అనుభవంపై నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తోంది.

సీఎంతో బొత్ససత్యనారాయణ భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంపై వీరు చర్చిస్తున్నాట్లు సమాచారం తెలిసింది.

” 26/11 ఇండియాపై దాడి ” సినిమా పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: ‘ 26/11 ఇండియాపై దాడి’ సినిమాకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ మార్చి 5కి వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ప్రతివాదులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఐటీ అంటే.. ఇండియన్‌ టాలెంట్‌ : పొన్నాల

హైదరాబాద్‌: ప్రతక్షంగా, పరోక్షంగా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఐటీ అంటే ఇండియన్‌ టాలెంట్‌ అన్న మంత్రి దేశానికి ప్రతిభ కలిగిన యువత అవసరం చాలా ఉందని పేర్కొన్నారు.…

సింగరంపాలెం వద్ద ట్రాక్టర్‌ బోల్తా :నలుగురు మృతి

గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా సింగరంపాలెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సింగరంపాలెంకు చెందిన ముఠా కూలీలు పనికి వెళ్లి తిరిగి ట్రాక్టర్‌పై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.…

అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమత

కోల్‌కతా : కోల్‌కతా సూర్యసేన్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల,…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,810గా ఉంది. కిలో వెండి…

లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబంర బుధవారం లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణం 6.6 నుంచి 6.2 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక సర్వే పేర్కొంది.

చట్టం తనపని తాను చేసింది : తులసిరెడ్డి

కడప : మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి వ్యవహారంలో చట్టం తనపని తాను చేసిందని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. తప్పు చేస్తే ఎవరూ చట్టానికి అతీతులు కారన్న ఆయన కడప డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష…

కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయమేది : నామా

గల్ఫ్‌ బాధితుల సమస్యల పరిష్కారంలో.. న్యూఢిల్లీ : ఉద్యోగాల పేరిట నకిలీ సంస్థలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. లోక్‌సభలో గల్ఫ్‌ బాధితుల సమస్యలపై నామా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ…