Wednesday, 18 November 2026

హైదరాబాద్

అక్రమ కట్టడాల కూల్చివేతలో స్వల్ప ఉద్రికత్త

హైదరాబాద్‌: వివాదస్పద గ్రీన్‌ ఫీల్డ్‌ భూముల్లో అక్రమకట్టడాల కూల్చివేత స్వల్ప ఉద్రికత్తకు దారితీసింది. ఈ భూముల వ్యవహారం రెండేళ్లుగా న్యాయస్థానంలో ఉండగానే ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై…

ఘనంగా కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలు

భద్రాచలం : ఖమ్మంలోని భద్రాచలం క్షేత్రంలో కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాగ్గేయకారుల చిత్రపటాలతో ఆలయ సన్నిధి నుంచి వూరేగింపుగా నగర సంకీర్తన చేశారు. అనంతరం సన్నిధిలోని రామదాసు విగ్రహానికి పవిత్ర గోదావరి నుంచి…

స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,750, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,800గా ఉంది. కిలో వెండి ధర రూ.…

ఆధార్‌ గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశం: పనబాక

న్యూఢిల్లీ : గ్యాస్‌ సబ్పిడీ కోసం ఆధార్‌ అనుసంధానం గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభ్యర్థనను పరిశీలించి ఈ మేరకు…

అక్బరుద్దీనను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు ఆయన్ను ఆదిలాబాద్‌ జిల్లా కారాగారం నుంచి నిజామబాద్‌కు తరలించారు. వివాదాస్పద ప్రసంగానికి సంబంధించి అక్బర్‌ స్వర నమూనాను న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు …

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. జనవరిలో 10.56 నుంచి 10.79 శాతానికి ఇది పెరిగిందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 0.6 శాతంగా నమోదైంది. 2011 డిసెంబర్‌లో ఇది 2.7 శాతంగా ఉంది.

శాసనసభ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల సంఘం భేటీ

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల సంఘం భేటీ అయింది. సంఘం ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి కాగ్‌ అభ్యంతరాలపై నేతలు సమీక్ష చేపట్టారు.

మూడోసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా

ప్యాంగ్‌యాంగ్‌: ఆంక్షలను లేక్కచేయకుండా ఉత్తరకొరియా మూడోసారి అణుపరీక్షలు నిర్వహించింది. అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడాన్ని గుర్తించినట్లు పలు దేశాలు వెల్లడించాయి. ఉత్తర కోరియాలో 5.1 తీవ్రతతో కూడిన కృత్రిమ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తాము గుర్తించినట్లు దక్షిణ కొరియా…

తెలంగాణపై డెడ్‌లైన్‌ పెట్టింది కాంగ్రేస్సే : ఈటెల

కరీంనగర్‌: తెలంగాణ ఇస్తామంటూ, పలానా రోజు ప్రకటన చేస్తామంటూ డెడ్‌లైన్లు పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీయే అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా  మాట్లాడారు. తెలంగాణ ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను…

ఐటీ కార్యాలయంలో బండ్ల గణేశ్‌ విచారణ

హైదరాబాద్‌: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ నివాసంలో సోదాలు కొనసాగిస్తున్న ఐటీ శాఖ అధికారులు ఆయన్ను విచారించేందుకు ఐటీ శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లారు. గణేశ్‌ నివాసంలో నిన్నటి నుంచి సోదాలు చేపట్టిన అధికారులు పలు రికార్డులను పరిశీలించి…