Sunday, 15 November 2026

హైదరాబాద్

ఉపకులపతిపై విద్యార్థుల దాడి

హైదరాబాద్‌ : ఎన్టీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతిపై విద్యార్థులు కోడిగుడ్లతో దాడి చేశారు. అచార్య ఎన్టీ రంగా జయంతి సందర్బంగా విగ్రహనికి పూలమాల చేసేందుకు వచ్చిన వీసీని విద్యార్థులు అడ్డుకోని దాడికి పాల్పడ్డారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా…

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

చిత్తూరు: సత్యవేడు మండలం రాజగోపాలపురం వద్ద విద్యుదాఘాతంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అమెరికాలో మిన్నంటిన సంబరాలు

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో బరాక్‌ ఒబామా జయకేతనం ఎగరవేశారు. దీంతో అమెరికాలో డెమొక్రాట్ల సంబరాలు మిన్నంటాయి. డెమొక్రాట్‌ పార్టీ తరపున రెండోసారి ఒబామా గెలుపొందడంతో షికాగోలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో చేరుకున్న అభిమానులు విజయోత్సవరంలో మునిగితేలారు.

అమెరికా ఎన్నికల్లో ఒబామా ఘనవిజయం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడుగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బరాక్‌ ఒబామా తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు శ్వేతసౌధంలో అధికారపీఠంపై కొనసాగుతారు. ఓట్ల లెక్కింపులో మొదట ప్రత్యర్థి మిట్‌ రోమ్నికంటే కొద్దిగా వెనుకబడినప్పటికీ, చివరలో పుంజుకొని…

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 28 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 11 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయం

అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. డెమోక్రాట్‌ పార్టీ తరపున రెండో సారి బరాక్‌ ఒబామా విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి రోమ్నీ చివరకు ఓడిపోయాడు. ఒబామాకు 275 ఓట్లు రాగా, రోమ్నీకి…

ఆధిక్యంలో ఒబామా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి మిట్‌ రోమ్నీల మధ్య పోటీ నువ్వా, నేనా? అన్నట్లు కొనసాగుతోంది. ఫలితాల్లో మొదట కాస్త వెనకబడిన అధ్యక్షుడు ఒబామా ప్రస్తుతం…

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో ఒబామా

వాషింగ్టస్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి మిట్‌ రోమ్నీపై ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం రోమ్నీకి 40 ఓట్లురాగా. ఒబామాకు 64 ఓట్లు లభించాయి. అధ్యక్ష…

ఇరాక్‌లో కారు బాంబు దాడి,.. 27 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. బాగ్దాద్‌ సమీపంలో ఆర్మీ లక్ష్యంగా ముష్కరులు కారు బాంబుతో దాడులకు తెగబడ్డారు.  ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా .. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు సమీప ఆసుపత్రికి…

తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్‌లో సంతోష్‌…