Saturday, 14 November 2026

నిజామాబాద్

తెలంగాణ యూనివర్సిటీలో వీసిని అడ్డుకున్న విద్యార్థులు

నిజామాబాద్‌: తెలంగాణ యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరగడాన్ని నిరసిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. కటాప్‌ మార్కులు తగ్గించాలని ఈ సంధర్బంగా విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

కె.కె తంగాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

దర్పల్లి : నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలం నల్లవెల్లిగ్రామంని కె.కె. తాండాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శనివారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తులు జరిపిన దాడిలో అటవీశాఖ రేంజ్‌ అధికారి గంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన…

కానిస్టేబుల్‌పై దాడి అమానుషం : డీఎస్‌

నిజామాబాద్‌ :హైదరాబాద్‌లో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ సందర్భంగా తెలంగాణ వాదులపై జరిగిన దాడులను పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ తీవ్రంగా ఖంఢించారు.ఇవాళ సభాప్రాంగణంలో జైతెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై సీమాంధ్రులు దాడి చేయడం చాలా అమానుషమని ఆయన…

పొలంలో మందు జల్లి కూలీ మృతి

రేంజర్‌ : పొలంలో మందులు జల్లిన అనంతరం అస్వస్థతకు గురై ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజర్‌ మండలంలోని తాడ్‌బిలోలి పంచాయతీ పరిధిలో మౌలాలీ తండాకు చెందిన రమేశ్‌(30) వరి పొలంలో…

సీమాంధ్ర ఉద్యమం కృత్రిమమే : కోదండరాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం కృత్రిమ ఉద్యమమేనని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం విమర్శించారు. అక్కడ జరుగుతున్న ఆందోళనలను ఎక్కువ చేసి ప్రసారం చేస్తున్న సీమాంధ్ర చానళ్లపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరి

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా వినాయకనగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని హుండీని పగలకొట్టి నగదును అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. రెండేళ్లలో ఈ ఆలయంలో  నాలుగుసార్లు చోరీ…

ఘనంగా శివలింగార్చన పూజలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో గోశాలలోని లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్‌దాస్‌ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను తయారు చేసి వాటిని రోజుకో ఆకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు అర్ధనారీశ్వరీ ఆకారంలో…

ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ ఏఈ

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నాగిరెడ్డిపేట పంచాయతీ రాజ్‌ ఏఈ శ్రీనివాస్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

నిజామాబాద్‌ జిల్లాలో విషాదం

నిజామాబాద్‌: నౌపేట మండలం బినోలా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి చాకలి లక్ష్మణ్‌ (17) మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం,  20 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.