Saturday, 21 November 2026

జాతీయం

ఆజాద్‌తో సమావేశం కానున్న సీఎం కిరణ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జీ గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై కూడా ఆజాద్‌తో కూడా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.

120 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ: రోలుగుంట మండలం నందివంపు వద్ద రూ. 12లక్షల విలువైన 120  కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

సోనియాతో కేకే భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.కేశవరావు భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ దాదాపు సంవత్సరం తరువాత సోనియాను కలిసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పై సోనియా ఆరా తీశారని తెలిపారు.

కాసేపట్లో ఆజాద్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు గులాంనబీ ఆజాద్‌తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాసేపట్లో భేటీ కానున్నారు. పార్టీ అంశాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించేందుకు బొత్స ఈరోజు ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు.

సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై

ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే…

కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లే శాసనసభ, స్థానికసంస్థల నిర్వీర్యం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విజయవాడ : కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభను, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. ఈరోజు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని…

ఆజాద్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ : కేంద్రం మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై కూడా ఆజాద్‌తో సీఎం చర్చించనున్నట్లు సమాచారం.

నష్టాలతో ప్రారంభమెన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌సీ సెన్సెక్స్‌ 51 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయాయి.

వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానుకోవాలి: మంత్రి ఆనం

విజయవాడ: వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానుకోవాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేశారు. వైఎస్‌ హయాంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.500 కోట్ల బకాయిలు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని ఆయన తెలిపారు. వైఎస్‌ చెప్పినట్లే వివాదాస్పద…

విచారణకు పూర్తిగా సహకరిస్తాం: రాజస్థాన్‌ రాయల్స్‌

న్యూఢిల్లీ : ఐపీఎల్‌-6లో ఫిక్సింగ్‌ ఆరోపణలతో తమ జట్టు క్రికెటర్లు అరెస్టు కావడంపై రాజస్థాన్‌ రాయల్స్‌ రాయల్స్‌ యాజమాన్యం స్పందించింది. ఈకేసు విచారణలో పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.