Tuesday, 24 November 2026

సీమాంధ్ర

రైలు ఇంజన్‌ మోరాయించడంతో నిలిచిన ట్రాఫిక్‌

పాలకొల్లు పట్టణం: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు భీమవరం జాతీయ రహదారి 216 సమీపంలో రైలు ఇంజన్‌ మొరాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దీని కోసం భీమవరం, విజయవాడ నుంచి అధికారులు రానున్నారు.

ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్‌

విశాఖ,(జనంసాక్షి): మునగపాక సర్వేయర్‌ సూర్యనారాయణ ఏసీబీ అధికారులకు చిక్కారు. రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సూర్యనారాయణను పట్టుకున్నారు.

నగదు పంచుతూ దొరికిన టీడీపీ కార్యకర్తలు

గుంటూరు,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాడేపల్లి మండలం చెర్రావూరులో నగదు పంచుతున్న ఇద్దరు తెలుగుదేశం కారకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు…

కారు ఢీ: ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

సంగం: అతివేగంతో వస్తున్న కారు ఢీ కొని ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో జరిగింది. తరుణవాయి గ్రామానికి చెందిన విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలోని కళాశాలకు వెళ్లేందుకు బస్సుకోసం ముంబయి రహదారి…

విమానాశ్రయం ప్రాంతంలో దుండగుల చేతిలో ఓవ్యక్తి మృతి

విశాఖ: విశాఖ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి మూటలో కట్టి విమానాశ్రయం పరిసరాల్లో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని…

48గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 48గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరు: వెంకయ్యనాయుడు

బారకాన్‌, నెల్లూరు: దేశవ్యాప్తంగా మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు పన్నినా అవి వృథాయేనని భాజపా జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

ఆగస్టు 21న ప్రారంభంకానున్న శ్రావణపౌర్ణమి వ్రతాలు

విశాఖపట్నం, ఎం.వి.పి. కాలనీ:తితిదే, డిపిపి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో 1130 దేవాలయాల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ధర్మప్రచార మండలి జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు తెలిపారు. ఆగస్టు 8 నుంచి ఆలయ శోభ పేరిట…

స్వతంత్ర గ్రూపుపై ఐటీ దాడులు

రాజమండ్రి,(జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని స్వతంత్ర గ్రూపుపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ, స్వతంత్ర ఆస్పత్రులపై ఏక కాలంలో అధికారులు దాడులు చేశారు. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు గన్ని భాస్కరరావు  నేతృత్వంలో…

సమైక్యాంధ్ర కోసం వీరాశివారెడ్డి రాజీనామా

కడప,(జనంసాక్షి): సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోసారి డ్రామాలకు తెరలేపారు. సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి కమలాపురం ఎమ్మెల్యే శివారెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసినట్లు తెలిపింది. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు వీరాశివారెడ్డి ప్రకటించాడు.