Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పోలీస్‌ అధికారి

అనంతపురం: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులే నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. కడప పోలీస్‌ కంట్రోల్‌ రూంలో సీఐగా పనిచేస్తున్న అర్జున్‌ నాయక్‌ తన భార్య పద్మలత భాయితో అనంతపురం జిల్లా నల్లమాడ పంచాయతీకి నామినేషన్‌ వేయించారు. ఈ స్థానం మహిళకు…

ఎన్నికలకు నాలుగంచెల భద్రత: డీఐజీ బాలకృష్ణ

అనంతపురం,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అనంతపురం రేంజ్‌ డీఐజీ బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. పంచాయితీ వేలంపాటంకు సహకరిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి ఎస్‌ఐపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 15 వేల…

అక్రమంగా తరలిస్తున్న 35 కిలోల బంగారం పట్టివేత

నెల్లూరు: చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న 35 కిలోల బంగారాన్ని నెల్లూరు రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తిరుపతిలో విద్యార్థుల రాస్తారోకో

తిరుపతి : సమైక్యాంధ్ర బంద్‌కు మద్దతుగా తిరుపతి ఎన్టీఆర్‌ కూడలిలో విద్యార్థులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. గాంధీరోడ్‌లో వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసి వేసి…

గుంటూరులో ఎక్సైజ్‌ కార్యాలయం ముట్టడి

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ఎక్సైజ్‌ విధానానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు వేర్వేరుగా అందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఉదయం పదిన్నర గంటల నుంచి ఒక్కో పార్టీ…

సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన చేపట్టిన ఏయూ విద్యార్థులు

విశాఖపట్నం,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సీటీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోర్‌ కమిటీ సభ్యుల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా…

గుంటూరులో కలెక్టరేట్‌ ఎదుట మాదిగ సేవాదళ్‌ దీక్ష

గుంటూరు: గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మాదిగ సేవాదళ్‌ 12 గంటల డప్పు, దరువుల మేలుకొలుపు దీక్ష చేపట్టింది. ఎస్పీ వర్గీకరణ లేని రాష్ట్ర విభజన చర్చలకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు మాదిగ సేవాదళ్‌ ప్రతినిధులు తెలిపారు.

సమైక్యాంధ్రకు మద్దతు కోసం విద్యాసంస్థల బంద్‌

తిరుపతి:సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం , రాజమండ్రి, కర్నూలు, కడప తదితర నగరాల్లో విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. కర్నూలులో కోర్టు విధులు బహిష్కరించాలని న్యాయవాదుల ఐకాస…

కుటుంబ కలహాలతో ఘర్షణ వల్ల ఓ మహిళ మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం యాతపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. దాడిలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.…

ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని కొండగేరిలో నందన కుర్వఅల్లెన్నను అతని సోదరుడు కుర్వపుల్లన్న వేటకొడవలితో దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ హత్యతో పత్తికొండ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి…