Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఉత్తరాఖండ్‌లో 8 మంది ఏపీ వాసులు మృతి

విశాఖపట్నం,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ చెందిన ఎనిమిది మంది మృతిచెందారు. ఇవాళ మంత్రి రఘువీరా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో మన రాష్ట్రానికి చెందిన మంది మృతి చెందారు. ముప్పై మూడు మంది తెలుగు వారు వరదల్లో గల్లంతైనారు. వరదల్లో చిక్కుకున్న వారిని…

అవి రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు సీఎం

విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 355 అదర్శ పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా తేగాడలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా, వైకాపా పార్టీలు రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలని విమర్శించారు.…

జైలు సూపరింటెండెంట్‌ కుమార్తె ఆత్మహత్య

విజయవాడ : విజయవాడ జైలు సూపరింటెండెంట్‌ కుమార్తె హరిప్రసన్న ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకుంది. అమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎంబీబీఎస్‌ చదువుతోంది.

వ్యక్తి హత్య రూ. 7కోట్లకు పైగా దోపిడీ

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్‌ కళాశాల వద్ద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో నగదు నింపే కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని వద్ద నుంచి…

రెండున్నర టన్నుల ఎర్రచందనం స్వాధీనం

సంబేపల్లి : బొలెరో వాహనంలో దాదాపు రెండున్నర టన్నుల ఎర్రచందనాన్ని తరలిస్తుండగా కడప పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 50లక్షలు ఉంటుందని వారు చెబుతున్నారు. వాహనంలో ఉన్న వారు పోలీసులను చూపిన వెంటనే…

అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ దాడి

కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సెక్టారు సూపర్వైజరు పాలక శాంతికుమారి రూ. 2వేలు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రఘువీర్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు ఎస్‌కె…

రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని రెండు చోట్ల అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి  రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దువ్యూరు మండలం కానగూడూరు వద్ద టాటా ఐషర్‌ వాహనంతో…

నష్టాలో స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: వారం ప్రారంభంలో షేర్‌ మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్‌ మొదలైన కాసేపటికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 130 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ సైతం అదే బాట పట్టి 36 పాయింట్లు తగ్గింది.

గంగవరం పోర్టులో ట్రాలర్‌ బోల్తా

విశాఖ: గంగవరం పోర్టు మూడో నెంబర్‌ బెర్తులో ఓ ట్రాలర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌ గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

పాతక్షక్షలతో వ్యక్తి హత్య

కర్నూలు : కోయల కుంట్ల మండలం చిన్నకొప్పెర్లలో పాతకక్షలతో వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిని ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కుందూ నదిలో పడేశారు.