Monday, 23 November 2026

సీమాంధ్ర

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

ఎల్‌.ఎన్‌.పేట : శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట మండంల ఎంబారం చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిని రక్షించేందుకు చెరువులో దిగిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

సీలేరు నదిలో జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి

విశాఖ: సీలేరు నదిలో ప్రమాదవశాత్తు జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి చెందాడు. జెన్‌కోలో పనిచేస్తున్న మేకా శ్రీనివాస్‌ ఈ ఉదయం నదిని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.…

రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

ఏర్పేడు : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ఆముడూరులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అటవీశాక అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

కడప డీసీసీబీ అధ్యక్షుడిగా ఇరగం తిరుపాల్‌రెడ్డి ఎన్నిక

కడప : కడప డీసీసీబీ అధ్యక్షుడిగా వైకాపా మద్దతుదారుడు ఇరగం తిరుపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. 14 డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్లుగా…

కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రారంభం

కడప: కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. ఈ ఎన్నికకు 8 మంది వైకాపా డైరెక్టర్లు హాజరయ్యారు.

సింగరంపాలెం వద్ద ట్రాక్టర్‌ బోల్తా :నలుగురు మృతి

గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా సింగరంపాలెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సింగరంపాలెంకు చెందిన ముఠా కూలీలు పనికి వెళ్లి తిరిగి ట్రాక్టర్‌పై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.…

చట్టం తనపని తాను చేసింది : తులసిరెడ్డి

కడప : మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి వ్యవహారంలో చట్టం తనపని తాను చేసిందని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. తప్పు చేస్తే ఎవరూ చట్టానికి అతీతులు కారన్న ఆయన కడప డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష…

బిట్రగుంట రైల్వేస్టేషన్‌ వద్ద తెగిపడిన రైల్వే విద్యుత్‌ తీగ

నెల్లూరు : జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్‌ వద్ద రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే ఓహెచ్‌ఆర్‌ తీగ బుధవారం ఉదయం తెగిపడింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు కేరళ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లోనే నిలిపివేశారు. వైరు తెగపడటం వల్ల పాదచారుల వంతెనపై విద్యుత్‌…

ముంగిలిపట్టు వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలి పట్టు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు-లారీ ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం…

అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీరు విడుదల

విశాఖ: అసోంలో అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీర్‌ను పైడిరాజు విడుదలయ్యారు. మంగళవారం రాత్రి బోడో తీవ్రవాదులు అయన్ను విడిచిపెట్టారు. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న పైడిరాజును దిగువ అస్సాంలోని బక్సా జిల్లాలో గత శనివారం గుర్తు తెలియని కొందరు…