Saturday, 28 November 2026

వార్తలు

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణ దేవుడు నిన్న శాంతించినట్టే కనిపించినప్పటికీ ఆదివారం రాత్రి నుంచి మళ్లీ విజృంభిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా వరంగల్‌ నగరంలో డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విస్తారంగా…

24 కు వాయిదా పడిన అనిల్‌ అంబానీ కేసు

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సీబీఐ తమను సాక్ష్యులుగా చేర్చడంపై అనిల్‌ అంబానీ పున:సమీక్ష పిటిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.  కోర్టు పిటిషన్‌ స్వీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు జవాన్ల కిడ్నాప్‌

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లా బేనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధితోని అటవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్రీన్‌హంట్‌ పేరుతో  జవాన్లు ఆదివాసులపై  దౌర్జన్యాలకు పాల్పడుతున్నందుకే ఈ చర్యకు పాల్పడినట్లు…

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

హైదరాబాద్‌: గురుపౌర్ణమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా అలయాలకు ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట సాయిబాబా అలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని సాయిబాబా అలయాలు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిలలాడుతున్నాయి.…

నాలుగో రోజుకు చేరిన 108 ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్‌,(జనంసాక్షి): చాలి చాలని జీతాలు అందక 108 ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేటికి నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను లేబర్‌ కమిషనర్‌ చర్చలకు ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటలకు జీవీకే యాజమాన్యం, 108 ఉద్యోగులతో లేబర్‌…

విద్యుత్‌ షాక్‌తో సర్పంచ్‌ అభ్యర్థిని మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలంలో వంతడుపుల గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తల్లి కూతురు మృతి చెందారు. మృతుల్లో రోజ(22) సర్పంచ్‌ అభ్యర్థినిగా పోటీలో బరిలో నిలిచింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మరణించింది. ఇంట్లో విద్యుత్‌ బల్బును సరిచేస్తూ…

శాకాంబరి దేవిగా శ్రీశైల భ్రమరాంబ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున అలయంలో ఆషాడ పౌర్ణమి పురస్కరించుని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబదేవికి శాకాంబరి ఉత్సవాన్ని వైభంగా నిర్వహించారు. దేవి మూలమూర్తి, ఉత్సవమూర్తులతో పాటు ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవతా మూర్తులను…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

విశాఖ,(జనంసాక్షి): వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖలలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఐదు ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లాలో ఐదు ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది.

ప్రారంభమైన ఎంబీబీఎన్‌, బీడీఎన్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 29 వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది. హైదరాబాద్‌, విశాఖపట్నం , విజయవాడ , తిరుపతి కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.