Saturday, 28 November 2026

వార్తలు

అంబర్‌పేటలో యాచకుడి వీరంగం

హైదరాబాద్‌: అంబర్‌పేట సాయిబాబా అలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో ఓ యాచకుడు వీరంగం సృష్టించాడు. తంబాకు అడిగితే ఇవ్వలేదని ప్రకాశ్‌ నారాయణను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

రెండు గ్రామాలు జలదిగ్బంధం

ఆదిలాబాద్‌ జిల్లా : జిల్లాలోని పెన్‌గంగ వరద ఉద్ధృతికి సిర్పూర్‌ (టి) మండలంలోని టోంకిని, వెంకట్రావుపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామస్థులందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నీటిని విడుదల చేస్తున్న అధికారులు

ఖమ్మం జిల్లా: చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి 9,200 క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

హోటల్‌లో అగ్నిప్రమాదం

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎడతెరపి లేకుండా వర్షం

వరంగల్‌: జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 8.25 అడుగులకు చేరింది. నీటి మట్టం 8.5 అడుగులకు చేరితె మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, పెన్‌గంగ

ఆదిలాబాద్‌: గత నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేమనపల్లిలో 600 ఎకరాలు, కోటపల్లి మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. సిర్పూర్‌ (టి) సమీపంలో తాటిచెట్టు ఒర్రె వంతెనపై…

నేటి నుంచి ప్రారంభమైన యాషెన్‌ రెండో టెస్టు

లండన్‌: లార్డ్స్‌లో యాషెన్‌ రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌1-0 అధిక్యం సాధించిన ఇంగ్లాండ్‌ తన అధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలనంకుంటుండగా, సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో కంగారూ జట్టుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా…

1060 కిలోల గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

విశాఖ: జిల్లాలోని రోలుగుంట మండలం నిండుగొండ వద్ద 1060 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న జీవును స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్టు చేశారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

విశాఖలో బారీ పేలుడు పదార్థాలు స్వాదీనం

విశాఖ : జిల్లాలోని రోలుగుంటలో బారీగా అమ్మెనియం నైట్రేట్‌, జిలెటిన్‌ స్టిక్స్‌ తరలిస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. 32 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌, 1500 డిటోనేటర్లు, 200 జిలెటెన్‌ స్టిక్స్‌ స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని…

అక్షయ గోల్డ్‌ సంస్థపై సిఐడి కేసు

హైదరాబాద్‌: అక్షయ గోల్డ్‌ ఫామ్స్‌ అండ్‌ మిల్లర్స్‌ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రకాశం, ఒంగోలు, చీరాలలో సీఐడీ కేసులు నమోదు చేసింది. సంస్థ ఎండీ హరనాథ్‌బాబు సహా 9 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. మెదక్‌, అనంతపురం,…