Saturday, 28 November 2026

వార్తలు

బంగారం దుకాణంలో భారీ చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 15 తులాల బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వాహన తనిఖీల్లో రూ. 26లక్షలు స్వాధీనం

మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మెట్టమీదపల్లి వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారును తనఖీ చేయగా రూ. 26లక్షలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు…

నీట్‌ నోటిఫికేషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: నీట్‌ నోటిఫికేషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు నీట్‌ రద్దు చేయాలని తీర్పునిచ్చారు. నీట్‌ నిర్వహించే అధికారం ఎంసీఐకు లేదని న్యాస్థానం తేల్చిచెప్పింది. రాష్ట్రాలు వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పు…

పాక్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు

వాషింగ్టన్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌లో అసలే దారుణంగా ఉన్న హిందువులు, షియాలు, క్రిస్టియన్ల పరిస్థితి ఇటీవలీ కాలంలో మరింత దిగజారింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యూఎస్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) అనే సంస్థ వెల్లడించింది. విదేశాల్లో మతస్వేచ్చ…

కారుపై చెట్టు విరిగిపడటం వల్ల నలుగురు మృతి

మహారాష్ట్ర: నాగర్‌సోల్‌ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. నాగర్‌సోల్‌ నుంచి షిరిడీ వైపు వెళ్తున్న కారుపై చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన…

ఉనికి కాపాడుకునేందుకే విజయమ్మ దీక్షలు: గండ్ర

వరంగల్‌: దొంగదీక్షలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తమ పార్టీ ఉనికిని కాపాకునేందుకే విజయమ్మ దొంగ దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అంశంపై వైకాపా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందన్నారు. తెలంగాణపై…

బెల్లంపల్లి ఏరియాలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్‌: భారీ వర్షాల కారణంగా బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖైరిగూడ, డోర్ని 1,2 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

వాగు ఉద్ధృతికి 29 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఖమ్మం: జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి వాగుపై పది అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతికి వాజేడు మండలంలోని 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి గొల్లపాడుకాలువ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుందరయ్యనగర్‌, మంచికంటినగర్‌ కాలనీల్లోకి…