Saturday, 28 November 2026

వార్తలు

వరదలో కొట్టుకుపోయిన పోలీసుల తుపాకులు

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని శంకవాగులో పోలీసు బలగాలకు చెందిన రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు గల్లంతయ్యాయి. మంగళవారం రాత్రి అడవుల్లో స్పెష్టల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో శంకవాగు దాటుతుండగా ముగ్గురు పోలీసులు…

ఎమ్మెల్యే సోదరుడి దారుణ హత్య

మహాబూబ్‌ నగర్‌ : జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తమ్ముడు జగన్మోహన్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు జగన్మోహన్‌ను కాల్చి చంపారు. అతని స్వగ్రమంలో పంచాయతీ…

సోనియాను కలిసిన పొన్నాల లక్ష్మయ్య

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. తెలంగాణ అంశం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పొన్నాల సోనియాకు వివరించినట్లు సమాచారం.

స్వయంప్రతిపత్తిపై సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): స్వయం ప్రతిపత్తికి సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐని మరోసారి ఆదేశించింది. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు అంశాలను ఎవరితోను పంచుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేయండని చెప్పింది. ఏవైనా ఇబ్బందులు తలెత్తుతే…

వెయ్యి పంచాయతీలు ఏకగ్రీవం కావచ్చు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): గ్రామ పంచాయతీలు 1000 వరకు ఏకగ్రీవం కావచ్చని అంచనా ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. అందులో సగం పంచాయతీలను కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుచుకుంటారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కొనేళ్లపాటు హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని కోరినట్లు…

శంకర్‌రావుకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి శంకర్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిజిపి దినేష్‌ రెడ్డిలపై ఆయన చేసినట్లు ఆరోపిస్తున్న అనుచి వ్యాఖ్యలపై పోలీస్‌ విచారణను వారం రోజులపాటు నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి…

ఆమెరికాలోనూ ఆదరణ పొందుతున్న ‘భాగ్‌ మిల్కా భాగ్‌’

వాషింగ్టన్‌: ఫ్లైయింగ్‌ సిఖ్‌గా పేరొందిన అథ్లెట్‌ మిల్కా సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిందీ చిత్రం భాగ్‌ మిల్కా భాగ్‌ అమెరికాలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాక్సాఫీను దగ్గర విజయకేతనం ఎగరేసి విడుదలైన తొలి మూడు రోజుల్లోనే…

వర్షం కారణంగా నిలిచిన బొగ్గు గనిలో ఉత్పత్తి

కొత్తగూడెం: వర్షం కురుస్తున్న కారణంగా కొత్తగూడెంలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. రోజుకు అయిదు వేల టన్నుల వంతున రెండు రోజుల్లో పది వేల టన్నుల బొగ్గు…

217 ఐఐటీ సీట్లు ఖాళీ

కోల్‌కత్తా: ఐఐటీ మోజు తగ్గడమో, మరో కారణమో తెలియదుకానీ మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత కూడా దేశవ్యాప్తంగా 16 ఐఐటీల్లో మొత్తం 217 సీట్లు ఇంకా భర్తీ కాకుండా మిగిలిపోయాయి. కొన్నేళ్ల క్రితం వరకూ ఐఐటీల్లో ఒక్క దఫానే…

హసన్‌అలీకి బెయిల్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ,(జనంసాక్షి): మనీల్యాండరింగ్‌ కేసులో నిందితుడు హసన్‌అలీ బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిందితుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలతో ఏకీభవించింది.