Saturday, 28 November 2026

వార్తలు

కాంగ్రెస్‌ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది: గపూర్‌

కడప: కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని కర్నూలు సీపీఎం పార్టీ మాజీ శాసనసభ్యులు గపూర్‌ విమర్శించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసమే పనిచేయడం దారుణమని అన్నారు. కడప సీపీఎం పార్టీ కార్యాలయంలో ఈరోజు నగర విస్తృత స్థాయి…

ప్రధాని అభ్యర్థిత్వానికి నరేంద్రమోడీ సమర్థుడు మురళీధర్‌రావు

హైదరాబాద్‌: ప్రధాని అభ్యర్థిత్వానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సమర్థుడని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో పుస్తకాలు చదివి మాట్లాడే రాహుల్‌ ప్రధాని అభ్యర్థిగా ఏమాత్రం సరితూగడని విమర్శించారు. హైదరాబాద్‌లో త్వరలో నిర్వహించనున్న మోడీ సభ…

ఐకాస ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సదస్సు

నెల్లూరు (బారకాసు): ఐకాస ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పద్మావతి కల్యాణ మండపంలో సమైక్యాంధ్ర సదస్సు జరిగింది. సభలో పాల్గొన్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ సీడబ్య్లూసీ, కోర్‌ కమిటీలో కానీ తెలంగాణపై నిర్ణయం తీసుకోరని అన్నారు.…

ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీ: వ్యక్తి మృతి

ఎల్కతుర్తి : కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ గ్రామం వద్ద ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొంది. గాయపడిన వ్యక్తి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విశాఖలో న్యాయవాదుల నిరసన

విశాఖ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బిర్లా కూడలిలో న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు అధికంగా…

వనపర్తిలో పౌరసరఫరాలశాఖ దాడులు

మహబూబ్‌నగర్‌: వనపర్తిలోని ఓ రైస్‌మిల్లులో పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 50లక్షల విలువైన ధాన్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న మాయావతి

ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా మాయావతి డిమాండ్‌ చేశారు.

సమైక్యాంధ్ర సభ వాయిదా వేసినట్లు మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌: ఈనెల 16న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర సభను వాయిదా వేసినట్లు మంత్రి శైలజానాథ్‌ తెలిపారు. ఢిల్లీ పరిణామాల దృష్య్టా బహిరంగ సభను వాయిదా వేసినట్లు అయన తెలిపారు.

నామినేషన్‌ పత్రాలు అపహరించిన మావోయిస్టులు

విశాఖ: విశాఖజిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి, బోయితలిలో అధికారుల నుంచి మావోయిస్టులు నామినేషన్‌ పత్రాలను లాక్కెళ్లారు. ఎన్నికలు బహిష్కరించాలంటూ ఘటనాస్థలంలో కరపత్రాలు వదిలివెళ్లారు.

వినాయకుడ్ని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి యాడ్యురప్ప

న్యాల్‌కల్‌: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యురప్ప మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌ సిద్ధింతల్‌ సిద్ధివినాయకుడ్ని దర్శించుకున్నారు. అయనకు అధికారులు, అర్చకులు అలయ సాంప్రదాయలతో స్వాగతం పలికారు. అలయంలో యడ్యూరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు.