Wednesday, 25 November 2026

వార్తలు

తెదేపా ప్రాంతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : కొంపెల్లిలో ఏర్పాటు చేసిన తెదేపా ప్రాంతీయ సదస్సు ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి పెద్ద పార్టీ నాయకులు హాజరయ్యాయి.

ఢిల్లీలో కూలిన నాలుగంతస్థుల భవనం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తూర్పు ఢిల్లీలోని జఫ్రాబాద్‌ సమీపంలో నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. పోలీసులు, రెస్య్కూటీంలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌ తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

నిజామాబాద్‌: హైదరాబాద్‌ కొంపల్లిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యేందుకు నిజామాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎ అలీం మాట్లాడుతూ….. స్థానిక సంస్థల…

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా,(జనంసాక్షి): సుమిత్రా దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.4 గా నమోదు అయింది. అయితే మరింత సమాచారం అందవలసి ఉంది.

సోనియాతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలిన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ శనివారం ఉదయం యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై సోనియా, దిగ్విజయ్‌ సింగ్‌ల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవలే…

పసికందును రహదారిపై వదిలేసిన సంఘటన

కరీంనగర్‌ : నెలలు నిండని ఓ పసికందును రహదారిపై వదిలేసిన ఘటన శనివారం ఉదయం కరీంనగర్‌లో చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని ఆర్‌టీసీ వర్క్‌షాపు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నెలలు పసికందును వదిలేసి వెళ్లిపోయారు. పసికందు మృతదేహాన్ని గమనించిన పాదచారులు…

9 నుంచి నిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

వరంగల్‌,(జనంసాక్షి): నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ల్లో బీటెక్‌ మెదటి సంవత్సరం సీటు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించేందుకు వరంగల్‌ నిట్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు నిట్‌ అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ టి. రమేష్‌ తెలిపారు.…

తండ్రి చేతిలో కూతురు హతం

ఖమ్మం గ్రామీణం: ఖమ్మం గ్రామీణ మండలం ఎమ్‌.వెంకటయ్యపాలెంలో కన్నకూతుర్నే ఓ తండ్రి గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం….. కొండా మమత (20) గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని…

ఆటోను కారు ఢీ: ఓ మహిళ మృతి

కోదాడ పట్టణం: నల్గొండ జిల్లా కోదాడలో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలుకూరు మండలం బేతవోలు నుంచి చిల్లకల్లు వెళ్తున్న ఆటోను కోదాడ జాతీయ…

విద్యుత్‌ కోతలు నిరసిస్తూ రాస్తారోకో

చేగుంట: మెదక్‌జిల్లా చేగుంట మండలం నారసింగిలో విద్యుత్‌కోతలు నిరసిస్తూ రైతులు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వారం రోజులుగా వ్యవసాయానికి రెండు, మూడు గంటల పాటే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని అగ్రహం చెందిన రైతులు ఈరోజు ఉదయం…