Wednesday, 25 November 2026

వార్తలు

చికిత్స పొందుతూ యువకుడి మృతి

నాచారం(హైదరాబాద్‌): తెలంగాణ కోసం పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సాయినాథ్‌ (22) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్లాపూర్‌కు చెందిన సాయినాథ్‌ బుధవారం ఉదయం పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి తీవ్రంగా…

భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు నేడు

హైదరాబాద్‌: భాజపా ఆధ్వర్యంలో మధ్యాహ్నం సికింద్రాబాద్‌ సిక్‌విలేజ్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమ ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు, భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు హాజరుకానున్నారు.

6 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు

చెన్నై: తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి ఐదుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి కనిమొళి పోటీలో ఉన్నారు. విజయకాంత్‌ పార్టీ నుంచి…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ప్రకాశం : ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గోదావరికి పోటెత్తిన వరద

రాజమండ్రి: గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ధవళేశ్వరం నుంచి 1.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 28.1 అడులకు చేరింది.

ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌

కడప: కడపలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాఘవేంద్రాచారి (26) బుధవారం అర్థరాత్రి కడప వన్‌టౌన్‌స్టేషన్‌ పరిధిలోని వీరాస్వామిమండి వీధిలో తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాఘవేంద్రాచారి 2009లో ఏఆర్‌…

ఆమ్‌ ఆద్మీ పోస్టర్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఏఏపీ) పోస్టర్‌పై కాంగ్రెష్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవినీతిపరులకు ఓటెస్తే అత్యాచారాలు కొనసాగుతాయి. అని ఏఏపీ పోస్టర్‌లో ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏఏపీ పోస్టర్లపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర…

హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌: 20 మంది ప్రాణాలను హరించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఎకె బ్రౌనె అన్నారు. ప్రమాదానికి గురైన ఎంఐ-17 వి5 తాలూకు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డరు లభించిందని దాన్ని విశ్లేషిస్తే కారణం కొంతవరకు…

డెహ్రాడూన్‌ బయల్ధేరిన చంద్రబాబు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. వరద బాధితులను బాబు పరామర్శించారు. ఆయన వెళ్లిన విమానంలోనే తెలుగు యాత్రికులు రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. తెలుగువారిని రాష్ట్రానికి తరలించే వరకు బాబు…

భద్రతా బలగాలు పంపాలని సుప్రీం నోటీసులు

ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఎన్నికల సంఘం కోరినట్లు సరిపడా భద్రతా బలగాలను ఏర్పాటు చేయక తప్పేలా లేదు. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలకు సరిపడా భద్రతా బలగాలు పంపాలని ఆ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నోటీసులు జారీ…