Wednesday, 25 November 2026

వార్తలు

ప్రజలను మోసం చేసేందుకే 30న సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ 30న టీ కాంగ్రెస్‌ పేరున హైదరాబాద్‌లో సభ పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. తెలంగాణ ప్యాకేజీ, రాయలసీమ జిల్లాల విభజన ప్రతిపాదనలకు తాము వ్యతిరేకమని కిషన్‌రెడ్డి వివరించారు.…

కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్మక్రియలు

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా వరదల్లో చనిపోయినవారి అంత్మక్రియలకు అలస్యమవుతందని అధికారులు తెలిపారు. అంత్యక్రియలకు ముందు మృతులకు సంబంధించిన డీఎస్‌ఏ భద్రపరుస్తున్నారు.

ఎక్సైజ్‌ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు:బీజేపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నూతన ఎక్సైజ్‌ విదానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీజపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29,30 తేదీల్లో కలెక్టరేట్లు, ఎక్సైజ్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి…

కొనసాగుతున్న యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : బదరీనాథ్‌ నుంచి జోషీమఠ్‌ వరకు యాత్రికుల తరలింపు కొనసాగుతోంది. కొద్దిసేపటి నుంచి వాతావరణం అనుకూలించడంతో సైన్యం సహాయక చర్యలను ప్రారంభించింది. బదరీనాథ్‌ నుంచి ప్రైవేటు, వాయుసేన హెలికాప్టర్లలో యాత్రికులను తరలిస్తున్నారు. డెహ్రాడూన్‌ , గౌచర్‌లో వైమానిక…

దిగి వచ్చిన పసిడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంగారం ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,119 వెండి కిలో ధర రూ. 39,550 గా ఉన్నాయి.

స్కూల్‌ వ్యాను బోల్తా: విద్యార్థి మృతి

చెన్నై : చెన్నైలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పల్లవరం-తొరైపక్కం రేడియల్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ వెళ్తున్న పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థి(14) తీవ్రంగా గాయపడ్డాడు.…

జాతీయపార్టీల నేతలతో భేటీ కానున్న టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌లో బుధవారం తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.

సహాయక చర్యలను పర్యక్షిస్తున్న ఏయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): బాధితులను తరలించడంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు చేపడుతున్న సహాయచర్యలను వైమానిక దళాల ప్రధానాధికారం బ్రౌన్‌ బాధితులను తరలించడంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికుల కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైమానికి దళ హెలికాప్టర్‌ కూలిన ఘటనలో సైనికుల మృతికి…

తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటుతాం: పొన్నాల

హైదరాబాద్‌ : ఈనెల 30న హైదరాబాద్‌లో చేపట్టే బహిరంగసభ ద్వారా తెలంగాణ ప్రజల అకాంక్షను చాటుతామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ మినహా మరే ప్రత్యామ్నాయానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

నేడు తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం కానుంది. ఢిల్లీలో జాతీయ సెమినార్‌ నిర్వహణ, తెలంగాణపై జరుగుతున్న పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.