Wednesday, 25 November 2026

వార్తలు

రాష్ట్రంలో మరో 5 పాలిటెక్నిక్‌ కళాశాలలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్‌ వ్యవసాయ పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ పద్మరాజు తెలిపారు. రాష్ట్రంలో మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

డెహ్రాడూన్‌ చేరుకున్న వైమానిక దళాల ప్రధానాధికారి

డెహ్రాడూన్‌ : బాధితులను తరలించడంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వైమానిక దళాల ప్రధానాధికారి బ్రౌనె తెలిపారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన వరద మృతులు, సైనికులు మృతికి సంతాపం తెలిపారు. బదరీనాథ్‌, హర్డిల్‌ ప్రాంతాల్లో…

హస్తినకు బయలుదేరిన బొత్స

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ అంశంపై హస్తిన పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో బొత్స హస్తిన పర్యటన ప్రధాన్యత చోటుచేసుకుంది.

12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌ : వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ కూలిన ఘటనలో 12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలను ఈరోజు వెలికతీశారు. సహాయ చర్యల కోసం కేదార్‌నాథ్‌ వెళ్లి వస్తున్న వాయుసేన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

హత్యకేసు దర్యాప్తు ముమ్మరం

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏటీఎం నగదు పర్యవేక్షకుడి హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ హత్యకేసులో కీలక నిందితుడు సహా 11మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కాకినాడ మాజీ…

తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

ఖమ్మం,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో అవుపల్లి, బాసగూడ, జేగురుగొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతమైన చర్ల సమీపంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుకుంటుంది. అప్రత్తమైన అధికారులు తాలిపేరు ప్రాజెక్టు సంబంధించి 23…

మాజీమంత్రి శంకర్రావుకు పోలీసు నోటీసు

హైదరాబాద్‌,(జనంసాక్షి): డీజీపీ దినేష్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి శంకర్రావును పోలీసులు సంజాయిషీ నోటీస్‌ ఇచ్చారు. అనారోగ్యం పేరుతో విచారణలో సహకరించడం లేదని నోటీస్‌లో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10గంటలలోగా తమ ముందు హాజరుకావాలని నోటీస్‌లో పోలీసులు ఆదేశించారు.

ధోనీ సేనపై ప్రశంసల వర్షం

– ధావన్‌, జడేజా, కొహ్లీలకు కితాబు ఢిల్లీ : ఇంగ్లండ్‌ గడ్డపై అద్బుత ఆటతీరుతో ఛాంపియన్స్‌ ట్రోఫి మిని వరల్డ్‌ కప్‌ సాధించిన ధోనీ సేనపై ప్రశంసల కర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఛాంపియన్స్‌ ట్రోఫిలో అసాథారణ ఆటతీరు కబర్చిన…

సహాయక చర్యలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద సహాయక చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. తాజాపరిస్థితిపై మంత్రులు శ్రీదర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో లోపాలుండరాదని అధికారులకు సీఎం ఆదేశాలు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

రాజాపేట : నల్గొండ జిల్లా రాజాపేట మండలంలోని బొందుగులలో రైతులు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ట్రాన్స్‌ఫార్మన్‌ మరమ్మతు చేయాలని ఫిర్యాదుచేసి వారం రోజులు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అరోపిస్తున్నారు. అందోళనకారులు సబ్‌స్టేషన్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది…