Wednesday, 25 November 2026

వార్తలు

లభ్యం కాని 430 మంది తెలుగువారి ఆచూకీ

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన వారిలో 430 మంది తెలుగువారి ఆచూకి లభ్యం కాలేదని సహాయ పునరావాస కమిషనర్‌ రాధ తెలిపారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి 2,616 మంది చారాధామ్‌ వెళ్లినట్లు చెప్పారు.…

ప్రతికూలతల నడుమ కొనసాగుతున్న సహాయ చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణంలో సైన్యం చేపట్టిన సహాయ చర్యలు ముందుకు సాగడం లేదు. సహాయం కోసం ఇంకా 8వేల మంది యాత్రికులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అధికారి లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 822 మంది…

చిదంబరంతో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణే: వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): గోదావరిఖని ఎనిమిదవ ఇక్లైన్‌ కాలనీలో అంబేంద్కర్‌ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ వివేక్‌, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే అని ఆయన తెలిపారు.…

అవినీతి రహిత సమాజం రావాలి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

బాపట్ల , గుంటూరు : ఉగ్రవాదం తీవ్రవాదం కంటే అవినీతి, లంచగొండితనం దేశానికి తీవ్రమైన హాని  చేస్తాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీపై హైకోర్టులో ఇవాళ ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలాఖరులో సీట్ల భర్తీపై స్పష్టత వస్తది అని ఉన్నతి విద్యామండలి చైర్మన్‌ జయప్రకాశ్‌రావు తెలిపారు. వీలైనంత…

డీసీ పత్రికా ఆఫీస్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని దక్కన్‌ క్రానికల్‌ పత్రికా కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

కేటీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత

వరంగల్‌,(జనంసాక్షి): ఓవర్‌ ఆయిలింగ్‌ పనుల కారణంగా కేటీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తిని అధికారలు నిలిపివేశారు. ఓవర్‌ ఆయిలింగ్‌ పనులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో 500 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

గజ్వేల్‌లో భార్యను నరికి చంపిన భర్త

మెదక్‌,(జనంసాక్షి): గజ్వేల్‌లోని బీడీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న ఇల్లాలిని భర్త దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.