Wednesday, 25 November 2026

వార్తలు

రేపు నగరానికి జవాను యాదయ్య మృతదేహం

హైదరాబాద్‌,(జనంసాక్షి): దేశ రక్షణ కోసం ముష్కరులతో పోరాడి ప్రాణాలర్పించిన సైనికుడు, అమరవీరుడు యాదయ్య మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. రేపు అమర జవాను భౌతికకాయాన్ని నగరానికి చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. యాదయ్య స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి.…

సుప్రీంలో రాన్‌ బాక్సీపై పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సుప్రీకోర్టు రాన్‌బాక్సీ మందుల కంపెనీకి ఊరట లభించింది. నాసిరకం మందులు అమ్ముతున్నారని ఆ కంపెనీ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.

మెదక్‌లో తెలంగాణవాదుల ముందస్తు అరెస్టు

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. తెలంగాణలో సీమాంధ్ర నేత పర్యటన సందర్భంగా పలువురు తెలంగాణ వాదులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ జోగిపేటలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పర్యటిస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు,…

కేదార్‌నాథ్‌లో 60మంది ఉన్నారు అజయ్‌ చద్దా

డెహ్రాడూన్‌ : వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయ కార్యక్రమాలకు అటంకం కలుగుతోందని ఐటీబీపీ డీజీ అజయ్‌చద్దా వెల్లడించారు. కేదార్‌నాథ్‌లో ఇంకా 60మంది యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు.

ఇద్దరు మాజీ మావోయిస్టులు అరెస్టు

హైదరాబాద్‌ : స్థిరాస్తి వ్యాపారి హత్యకేసులో ఇద్దరు మాజీ మావోయిస్టులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఉపాధి హామీ డబ్బుల కోసం కూలీల ధర్నా

ఖమ్మం,(జనంసాక్షి): ఉపాధి హామీ తాము చేసిన కూలీ డబ్బులు చెల్లించాలని కొత్తగూడెం ఎంపీడీవో ఆఫీస్‌ ముందు సుజాతనగర్‌ కూలీలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి పోలీసులు చేరుకుని పలువురు కూలీలను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు

ఉగ్రవాదాన్ని సంఘటితంగా ఎదుర్కొంటాం: ప్రధాని

శ్రీనగర్‌ : ఉగ్రవాద చర్యలను భారత్‌ సంఘటితంగా ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జమ్మూకాశ్మీర్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.…

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఏలూరు, సిర్పూరు, నార్నూరు మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో తెలుగు గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. వనద ప్రభావం ఉన్న కౌతాల, బెజ్జూరు మండలాల ప్రజల భయాందోళనతో గడుపుతున్నారు. వరదల…

బొత్సతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో బొత్సకు కార్మికుల సమస్యలను ఈయూ. టీఎంయూ నేతలు వివరించారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలిస్తే వెళ్తామని ,…