Wednesday, 25 November 2026

వార్తలు

ఆందోళనకరంగా మండేలా ఆరోగ్య పరిస్థితి

ప్రిటోరియా : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు అధికార ప్రతినిధి మాక్‌ మహారాజ్‌ ఈ సమాచారాన్ని వెల్లడించారు. అధ్యక్షుడు జాకబ్‌ జూమా, ఏఎస్‌సీ ఉపాధ్యక్షుడు రామ్‌ఫోసా ఆసుపత్రిలో…

ఉత్తరాఖండ్‌ సహాయచర్యలపై ఎస్‌డీఎం కార్యాలయంలో

ఉన్నతస్థాయి సమీక్ష ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయచర్యలపై ఢిల్లీలోని ఎస్‌డీఎంఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, ఐటీబీపీ, అధికారులతో ఉత్తరాఖండ్‌ నోడల్‌ అధికారి…

కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లి నిజామాబాద్‌ జిల్లా వాసి మృతి

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌కు యాత్రకు వెళ్లిన నిజామాబాద్‌ జిల్లా వాసి ఆకుల నారాయణ గౌడ్‌ మృతి చెందారు. ఆయన ఎల్లారెడ్డి మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వారు. సోమవారం నారాయణగౌడ్‌ బంధవులు కేదార్‌నాథ్‌ నుంచి స్వస్థలానికి బయలుదేరారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని తెల్కి గ్రామంలో శ్రీరాంరెడ్డి (45) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సోమవారం ఉదయం తన పొలంలో ఎద్దులతో దుక్కి చేస్తుండగా విద్యుత్‌ వైర్లు తాకడంతో ఆయన అక్కడికక్కడే మృతి…

టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

రంగారెడ్డి,(జనంసాక్షి)పెద్ద అంబర్‌పేటలో రహదారి నిర్మాణ పనుల ప్రారంబోత్సవంలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు కూల్చివేశారు.

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. సికింద్రాబాద్‌, బేగంపేట, మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లిలో భారీవర్షం మాదాపూర్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కోఠి,అబిడ్స్‌లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భాజపా ప్రచార సారథిగా మోడీ తొలి ప్రసంగం

పఠాస్‌కోట్‌ : భాజపా ప్రచారసారథి హోదాలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తొలిసారిగా పంజాబ్‌లోని పఠస్‌కోట్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌ దుర్ఘటన గురించి మాట్లాడుతూ యావత్‌ దేశం ఆ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.…

బాసరలో పోటెత్తిన భక్తులు

బాసర,(జనంసాక్షి): చదువుల తల్లి బాసర సరస్వతీ పుణ్యక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

టీఎన్‌సీఏ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ ఎన్నిక

చెన్నై,(జనంసాక్షి): క్రికెట్‌ అసోసియేషన్‌(టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్‌ శ్రీనివాసన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా 12వ పర్యాయం ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం విశేషం. 83 వ టీఎన్‌సీఏ జనరల్‌ మీటింగ్‌లో తయనను ఎన్నుకున్నారు. కాశీ విశ్వనాథన్‌ వరుసగా ఏడోసారి…

సైనికుల కృషి ఎంతో అభినందనీయం పయ్యావుల

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌ వరద బీభత్సంలో చిక్కుకున్న చార్‌ధామ్‌ యాత్రికులను కాపాడటంలో భారత సైన్యం కృషి ఎంతో అభినందనీయమని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రతి ఒక్కరు సైనికులక వందనాలు తెలిపాలని ఆయన సూచించారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి…