Wednesday, 25 November 2026

వార్తలు

రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని రెండు చోట్ల అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి  రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దువ్యూరు మండలం కానగూడూరు వద్ద టాటా ఐషర్‌ వాహనంతో…

విశాఖలో ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన

సీఎం విశాఖ: విశాఖలోని ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. సీఎం నేడు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

నష్టాలో స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: వారం ప్రారంభంలో షేర్‌ మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్‌ మొదలైన కాసేపటికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 130 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ సైతం అదే బాట పట్టి 36 పాయింట్లు తగ్గింది.

గంగవరం పోర్టులో ట్రాలర్‌ బోల్తా

విశాఖ: గంగవరం పోర్టు మూడో నెంబర్‌ బెర్తులో ఓ ట్రాలర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌ గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

పాతక్షక్షలతో వ్యక్తి హత్య

కర్నూలు : కోయల కుంట్ల మండలం చిన్నకొప్పెర్లలో పాతకక్షలతో వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిని ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కుందూ నదిలో పడేశారు.

కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక ఏరియల్‌ సర్వే కోసం వెళ్లిన మంత్రులు శ్రీధర్‌బాబు, బలరాం నాయక్‌ వెనుదిరిగారు.

కేదార్‌నాథ్‌లో యాత్రికులెవరూ చిక్కుకుని లేరు: డ్రెహాడూన్‌

కలెక్టర్‌ డెహ్రాడూన్‌ : కేదార్‌నాథ్‌ ప్రాంతంలో యాత్రికులెవరూ చిక్కుకుని లేరని డ్రెహాడూన్‌ కలెక్టర్‌ పురుషోత్తం చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పరిస్థితిపై ఈటీవీ అయన్ను ఫోన్‌లో సంపద్రించింది. ఈసందర్భంగా మాట్లాడుతూ యాత్రికులందరినీ కేదార్‌నాథ్‌ నుంచి 1500 మంది యాత్రికులు ఉన్నారని వారిని…

పీపీ పాండే పిటిషన్‌ను నేడు విచారించనున్న గుజరాత్‌ హైకోర్టు

అహ్మదాబాద్‌ : అదనపు డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ (ఏడీజీ) పీపీ పాండేకు సంబంధించిన పిటీషన్‌ను గుజరాత్‌ హైకోర్టు ఈ రోజు విచారించనుంది. పాండే 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి, 2004లో జరిగిన ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌…

పిల్లలకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌ : నగరంలోని గోల్కొండ ఇబ్రహీంబాగ్‌ ప్రాంతంలో ఇద్దరు పిల్లలకు నిప్పంటించి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందింది. స్థానికులు పిల్లలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని…

ఉత్తరాఖండ్‌ బాధితులకు కాంగ్రెస్‌ సాయం

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వరద బాధితులకందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తరపున పంపనున్న సహాయ సామాగ్రితో కూడిన వ్యాన్‌కు ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించనున్నారు. ఈ సహాయ సామాగ్రి బాధితులకు అందించేందుకు, అక్కడి సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు…