Wednesday, 25 November 2026

వార్తలు

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

(షాబాద్‌) రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన లింగారెడ్డి (20) అనే రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ద్విచక్రవాహనంపై ఈ తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి వస్తుండగా రోడ్డుపై విద్యుత్‌ వైరు తెగిపడటంతో ప్రమాదం జరిగింది.

భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ప్రారంభం

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాద్రి రామాలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో రామయ్య సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది.

అగ్ని ప్రమాదంలో రైతు సజీవదహనం

అల్లూరు : నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని సింగపేట పొలాల్లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వట్టికాల జయరామయ్య (50) అనే రైతు సజీవదహనమయ్యాడు. పొలం వద్ద గుడిసెలో నిద్రిస్తుండగా సమీపంలో ఉన్న 11కె.వి. విద్యుత్‌…

విశాఖ చేరుకున్న సీఎం

విశాఖ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంలో ఒలింపిక్‌డే రస్‌ను ప్రారంభిస్తారు. విశాఖ పర్యటన అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తారు.

చార్‌ధామ్‌ యాత్రికులకు సాయంపై ముఖ్యమంత్రి ఆదేశం

అందరిని భద్రంగా తీసుకురావాలి ఉచితంగా రవాణా, భాజన, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచన హైదరాబాద్‌న చార్‌దామ్‌ యాత్రకు వెళ్లి ఆపదలో చిక్కుకున్న తెలుగు యాత్రికులందరినీ భద్రంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.…

ఉత్తర బంగాళఖాతంలో అప్పపీడన ద్రోణీ

హైదరాబాద్‌న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణీ ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

సురక్షితంగా తిరిగొచ్చిన వరంగల్‌ జిల్లా వాసులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వరంగల్‌ జిల్లాకు చెందిన 8 మంది ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఖాజీపేట చేరుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ వీరికి స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు నరకాన్ని అనుభవించామని యాత్రకు వెళ్లొచ్చిన వారు…

15 మంది కోడిపందాలరాయుళ్ల అరెస్ట్‌

ముండ్లమూరు,(జనంసాక్షి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు వద్ద కోడి పందాల శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. 15 మంది కోడిపందాలరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. 4.500 రూపాయల నగదు, సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

గల్లంతైన వారి సమాచారం లేదు: గోయల్‌

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ ఇంకా 1000 మంది తెలుగు యాత్రికులున్నారని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ఇప్పటివరకు 1500 మందిని రక్షించి స్వస్థలాలకు పంపించినట్లు తెలిపారు. గల్లంతైన వారి నిర్ధిష్ట సమాచారం లేదన్నారు. ఉత్తరాఖండ్‌ యంత్రాంగమే…

కాజీపేటకు చేరుకున్న చార్‌థామ్‌ యాత్రికులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న చార్‌థామ్‌ యాత్రకులు కాజీపేట రైల్వేే స్టేషన్‌కు చేరుకున్నారు. ఇవాళ రైల్వే స్టేషన్‌ చేరుకున్న వరద బాధిత యాత్రకులకు స్థానిక ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఆహారం, మంచినీటి బాటళ్లను అందజేశారు. పది మంది…