Monday, 23 November 2026

వార్తలు

ఎలాంటి విచారణకైనా సిద్దం: తెరాస

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని తెరాస ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తే చూస్తూ వూరుకోమని…

తాడిమర్రి హైస్కూల్లో అగ్నిప్రమాదం

అనంతపురం,(జనంసాక్షి): తాడిమర్రి ప్రభుత్వ పాఠశాలలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫర్నిచర్‌తో పాటు రికార్టులు దగ్గమైనాయి. అయితే ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పాఠశాల అధికారులు తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌తో అద్వానీ భేటీ నేడు

ఢిల్లీ : భాజపా అగ్ర నేత ఎల్‌కే అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సంమ్‌భవన్‌లో నేడు భేటీ కానున్నారు. అనారోగ్యం కారణంగా అద్వానీ నిన్నటి సమావేశాలను వాయిదా వేసుకున్నారు. గోవా సమావేశాల్లో మోడీని పార్టీ ప్రచార సారధిగా…

రేపు స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతి కల్పించడంలో విఫలమైనందుకు, ప్రైవేట్‌ స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా రేపు ఏబీవీపీ స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. పాఠశాల మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్‌ విద్యాశాఖ డైరెక్టరేట్‌ ఆఫీసు…

ఉత్తర కాశీయాత్రలో చిక్కుకున్న కుషాయిగూడ వాసులు

హైదరాబాద్‌: ఉత్తర కాశీ, చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన యాత్రికుల్లో హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన 25 మంది ఉన్నారు. కొండచరియలు విరిగిపడ్డాయని, అక్కడి పరిస్థితులపై వస్తున్న వార్తలతో ఇక్కడ ఉన్న కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా రాష్ట్ర…

ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖపట్నం,(జనంసాక్షి): ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 97.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 9.07 శాతం, బాలికలు 97.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఎలాంటి విచారణకైనా సిద్దం: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలీంటి విచారణకైనా సిద్దమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని, ఉద్యమ…

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం: విషమంగా బాలిక పరిస్థితి

జన్నారం : ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం కామన్‌పల్లి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై పుష్పాపూర్‌ గ్రామానికి చెందిన రాజేశ్‌(29) అనే యువకుడు బుధవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఉన్న బాలికను తల్లిదండ్రులు రాత్రే జన్నారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.…

గాలి, శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓఎంసీ కేసులో నిందితులైన గాలి జనార్ధన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. ఆధారాలు తారుమారు చేస్తారన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసింది.