Monday, 23 November 2026

వార్తలు

దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా: లక్ష్మణ్‌

ఒంగోలు సాంస్కృతిక విభాగం : జులై 27న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 50 వేల మంది యువకులతో హైదరాబాద్‌లో భాజపా యువజన సమ్మేళనం నిర్వహించనున్నట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కె. లక్ష్మణ్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో…

నేడు బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం

హైదరాబాద్‌ : నగరంలోని గ్రీస్‌పార్క్‌ హోటల్‌లో ఈరోజు సాయంత్రం బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. బీసీ ఉప ప్రణాళికపై సమావేశంలో చర్చించన్నుట్లు సమాచారం.

కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ ఈ రోజు అత్యంత కనిష్ట స్థాయికి దిగజారింది. డాలర్‌తో పోలిస్తే రూ.60కి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 130 పైసలు పతనమైంది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకపు విలువవ రూ. 59.94 గా ఉంది.

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : గురువారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 360 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ నష్టాలో ఉండగా, 130 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది.

గంగోత్రిలో చిక్కుకున్న కృష్ణా వాసులు

కృష్ణా : కంకిపాడు మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన 18 మంది యాత్రికులు గంగోత్రీలో చిక్కుకుపోయారు. వారి క్షేమ సమాచారం తెలియక గ్రామస్థులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 15 నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.…

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని విపక్షసభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభసజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్‌ చేసిన విజ్ఞప్తిని విపక్షసభ్యులు తోసిపుచ్చారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌: వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని పట్టుబడుతూ విపక్షసభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి అందోళనకు దిగారు.

నేరమయ రాజకీయాలపై తెదేపా ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెరుగుతున్న నేరమయ రాజకీయాలకు నిరసనగా గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తెదేపా సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ… సకల జనుల సమ్మె వైఫల్యమవడానికి కేసీఆర్‌ కారణమని ఆరోపించారు. కేసీఆర్‌కు…