Saturday, 21 November 2026

వార్తలు

లారీ బోల్తా నిలిచిన రాకపోకలు

మహబూబ్‌నగనర్‌,(జనంసాక్షి): దేవరకద్ర వద్ద పెద్ద వంతెనపై లారీ బోల్తాపడింది. దీంతో హైదరాబాద్‌-రాయ్‌చూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆహార భద్రత బిల్లు, ఉత్తరాదిలో వరద సహాయక చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానితో పాటు యూపీఏ ఛైర్‌పర్సన్‌  సోనియాగాంధీ, ఆర్థిక మంత్రి చిదంబరం,…

టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం డ్రామా: కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు మాకు వద్దు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం ఓ డ్రామా అని తెలిపారు. చిత్తశుధ్ది ఉంటే అధిష్ఠానంతో కొట్లాడాలని పేర్కొన్నారు. జులై…

ప్యాకేజీలు వద్దు : కోదండరాం

మంచిర్యాల : తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. అదిలాబాద్‌ జల్లా మంచిర్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

కర్నూలులో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన

కర్నూలు : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. విద్యార్థినిపై యాజమన్యం చేయి చేసుకుందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: రఘువీరా

హైదరాబాద్‌ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుకున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : తెలంగాణకు ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తమ అభిమతమని, అదే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ… ప్యాకేజీ వల్ల సమస్యలు పెరుగుతాయని, తమకు…

కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌

కాకినాడ : ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. 0884 1077,0884  2365506 హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

నేడు ఛాంఫియన్‌ ట్రోఫి తొలి సమీఫైనల్‌

ఓవల,(జనంసాక్షి): లండన్‌ నగరంలో ని ఓవల్‌ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్‌ ట్రోఫి తొలి సెమీఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాఛ్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.