ఆటో, లారీ ఢీ: 8మంది విద్యార్థులు మృతి
తమిళనాడు : పుదుకోట్టయ్‌లో ఆటో, మినీలారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది విద్యార్థులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడు : పుదుకోట్టయ్‌లో ఆటో, మినీలారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది విద్యార్థులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేడు శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూకు వ్యతిరేకంగా ఓటు వేయాలని భాజపా ఎమ్మెల్యేలకు అపార్టీ వివ్ జారీ చేసింది.
ఢిల్లీ: కేంద్ర జౌళిశాఖ మంత్రిగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈసదర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ సంబంధమైన జౌళిశాఖను తనకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. రైతులు చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి…
హైదరాబాద్ : తొందరలోనే కాంగ్రెస్‌లో వైకాపా విలీనమవుతుందని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఎంగా వై. ఎస్ ఉన్నంతకాలం ఐఎంజీ భూ వ్యవహారాలపై ఎందుకు నిగ్గు తేల్చలేకపోయారని ప్రశ్నించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించుకుని సీమాంధ్ర నేతలందరితో చర్చిస్తామని మంత్రి శైలజానాథ్ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో తేల్చి చెప్పాలని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ప్యాకేజీలు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటే సమస్యకు పరిష్కార మార్గమని మంత్రి సూచించారు.
హైరదాబాద్ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.…
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి గ్రామ శివారులో ఓ వితంతు మహిళ (40) నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గ్రామానికి చెందిన రత్నమ్మగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.
హర్యానా: వందేళ్లలో ఎన్నడూ రానంతగా యమునా నదికి 8లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరిందని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా పేర్కొన్నారు. ఇకే నెలలో ఇంత భారీ స్థాయిలో వరదనీరు ఎప్పుడూ రాలేదన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ, సైన్యం తదతర…
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలుగుదేశం పార్టీ గస్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో…