Saturday, 21 November 2026

వార్తలు

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళన మధ్య శాసనసభ గురువారానికి వాయిదా పడిరది. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి అందోళనకు దిగారు.…

హత్యయత్నం కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రామంతపూర్‌ కాంగ్రెస్‌ కార్పోరేటర్‌ పరమేశ్వర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కాంగ్రెస్‌ నేత యంజాల శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.

శాసనసభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు శాసనసభలో అందోళన కొనసాగిస్తున్నారు. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే… తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తెలంగాణపై తీర్మానం…

రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

కడప : కోడూరు మండలం సూరపురాజుపల్లె వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాల్లో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 9 మంది స్మగ్లర్లను అరెస్టు…

శ్రీశైలం దేవస్థానం సర్వర్‌ రూంలో అగ్నిప్రమాదం

కర్నూలు,(జనంసాక్షి): శ్రీశైలం దేవస్థానం సర్వర్‌ రూంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. షర్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో అనీల్‌ అనే ఎలక్ట్రీషియన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 27,400గా ఉంది. కిలో వెండి ధర…

సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించిన సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మరోసారి మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించాడు. నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఛాంబర్‌…

స్పీకర్‌ ఛాంబర్‌లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ :శాసనసభలో మంత్రి అనం వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సభాపతి ఛాంబర్‌లో భైఠాయించారు. దీంతో మంత్రి అనం వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని…

మల్లన్న సేవలో సినీ నటుడు అల్లరి నరేశ్‌

శ్రీశైలం, కర్నూలు : సినీ నటుడు అల్లరి నరేశ్‌ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన నరేశ్‌ అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేశ్‌తో ఫోటోలు దిగేందుకు పలువురు భక్తులు పోటీపడ్డారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలోనూ అన్యాయమే

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం మెండిచేయి చూపించిందని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు అన్నారు. వడగండ్ల వాన, అకాల వర్షాల కారణంగా ఆరేళ్లుగా నష్టపోతున్న తెలంగాణ రైతులపై సీమాంధ్ర ప్రభుత్వం విపక్ష చూపుతుందని ఆరోపించారు.…